BREAKING
తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో పలాస నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఐపీఎల్ 2027 వేలానికి రంగం సిద్ధం: డిసెంబర్ 16న గోవా వేదికగా గ్రాండ్ ఆక్షన్ ఎన్నికల విధులకు కమర్షియల్ వాహనాలే వాడాలి.. జిల్లా ఎన్నికల అధికారి. కొత్తపేటలో పోలీసుల కార్డెన్ సెర్చ్ సినీ ఇండస్ట్రీకి లక్ష్మణ్ ఆరోగ్య గ్రామం బంపర్ ఆఫర్: అన్నీ ఉచితమే అంటున్న నిర్వాహకులు ఎన్నికల నియమావళి పాటించాలి. కుమ్ములాటల్లో కూటమి -ప్రచారంలో వైసీపీ. అరకులో రవికిరణం దూరం.. కూటమి శిబిరంలో పండగ వాతావరణం! ఎన్నికల నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు గ్రామాల్లో ఎన్నికల ప్రచార జోరు బస్సు నుంచి జారిపడి నర్సింగ్ విద్యార్థినికి గాయాలు అయినవిల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి సంధ్యారాణి ప్రచారం ముక్తేశ్వరంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళి - ఇంటింటి ప్రచారంలో ఓట్లు అభ్యర్థన జడ్పిటిసి బిఫారం అందజేసిన రెడ్డి శాంతి. దోసకాయలపల్లిలో వైఎస్సార్‌సీపీలో చేరిన జనసేన శ్రేణులు శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలి

మహిళా హత్య కేసును చేదించిన జిన్నారం పోలీసులు

Select Suryaa Now
మహిళా హత్య కేసును చేదించిన జిన్నారం పోలీసులు


 జిన్నారం:మహిళ దారుణ హత్య కేసును జిన్నారం పోలీసులు ఛేదించారు. భార్యపై అనుమానం పెంచుకొని ఆమెను హత్య చేసిన భర్త హుస్సేన్‌ (43)ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు వివరాలను జిన్నారం ఎస్‌హెచ్‌ఓ నాగార్జున గౌడ్‌ వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా రాలమడుగు గ్రామానికి చెందిన హుస్సేన్ (43) జీవనోపాధి కోసం చర్చి గాగిలాపూర్‌లో తన భార్య అఫ్రీన్‌ బేగం(34), ఇద్దరు పిల్లలు ఆలియా, బిలాల్‌తో కలిసి నివాసం ఉంటున్నాడు. హుస్సేన్ డ్రైవర్ గా పనిచేస్తుండగా, అఫ్రీన్‌ బేగం కూలి పనులకు వెళ్తుండేది.ఈ క్రమంలో పని చేసే చోట ఇతరులతో భార్య చనువుగా ఉంటోందని హుస్సేన్‌ అనుమానం పెంచుకున్నాడు.దీంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దసరా పండుగకు ముందు రోజు కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అనంతరం భార్యను బయటకు తీసుకెళ్తానని నమ్మించిన హుస్సేన్‌.. ఆమెను వావిలాల గ్రామ శివారులోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడే ఆమెతో శారీరకంగా కలిసి గొంతు నిలిమి చంపేశాడు. అనంతరం మెదక్‌కు వెళ్లిన నిందితుడు.. భార్య కనిపించడం లేదంటూ ఆమె ఫోన్‌ను బస్టాండ్‌ సమీపంలో పడేసి, పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదు చేయించాడు.ఆ తర్వాత తిరిగి హత్య చేసిన ప్రాంతానికి వెళ్లి, ఆమె మరణించిందో లేదోనన్న అనుమానంతో మరోసారి కత్తితో గొంతుపై దాడి చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన జిన్నారం పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.