telangana
ఎల్లంపేట అభివృద్ధే లక్ష్యం: మున్సిపల్ చైర్మన్ లావుడియా శ్రీదేవి రమేష్
మేడ్చల్ ,మేజర్ న్యూస్:ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని నూతనకల్ 21వ వార్డులో రూ.10 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లావుడియా శ్రీదేవి రమేష్, కౌన్సిలర్లు చిన్నోళ్ల భాస్కర్, సద్ది సురేష్ రెడ్డి, మాజీ సర్పంచ్ కవిత జీవన్,మాజీ వార్డు సభ్యులు యూనిస్ పాషా, మహేందర్ రెడ్డి, వర్క్ ఇన్‌స్పెక్టర్ సురేష్, రాము పాల్గొన్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ లావుడియా శ్రీదేవి రమేష్ మాట్లాడుతూ.. ఎల్లంపేట మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని, మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి రోడ్లు, డ్రైనేజీలు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. ఎల్లంపేట మున్సిపాలిటీని రాష్ట్రంలోనే అత్యున్నత మున్సిపాలిటీగా మార్చడమే తమ ధ్యేయమని ఆమె తెలియజేశారు.21వ వార్డు కౌన్సిలర్ చిన్నోళ్ల భాస్కర్ మాట్లాడుతూ.. వార్డు అభివృద్ధే తన ప్రధాన ధ్యేయమని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తన సమస్యలుగా భావించి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో గెలిపించిన ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, వార్డు అభివృద్ధిలో ముందుంటానని హామీ ఇచ్చారు.