BREAKING
సీతానగరం మండలంలో ప్రభుత్వ భూముల పరిశీలన ఓటర్ల సవరణ ఆర్డర్లపై సుప్రీంకోర్టులో కేంద్ర ఎన్నికల సంఘం కౌంటర్ మెగాస్టార్ సంక్రాంతి రేసులో కన్ఫ్యూజన్: 'కాకా'నా లేక 'విశ్వంభర'నా? బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సరికొత్త చరిత్ర: 400 కోట్ల మైలురాయిని దాటిన కలెక్షన్లు అర్నబ్’ తుపాను పై ముందస్తు భద్రతా చర్యలను ముమ్మరం చేసిన దక్షిణ కోస్తా రైల్వే.. గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి చేపల నాగమణి ఎన్నికల ప్రచారం! ఎన్నికల నియమావళి, అర్ణబ్ తుఫాన్ పై గ్రామాల్లో అవగాహన. కన్స్యూమర్ డిమాండ్ స్ట్రాంగ్.. మార్జిన్లపై ముడిసరుకుల సెగ! జడ్పిటిసి పీఠం ఎవరికి?. బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా 'ఉడ్తా తిర్' జోరు మందగమనం: మొదటి సోమవారం భారీగా పడిపోయిన కలెక్షన్లు ఆటో మార్జిన్లు అప్: వాల్యూమ్స్, ప్రీమియమైజేషన్‌తో పుంజుకోనున్న రంగం! మూడు దశాబ్దాల తర్వాత థియేటర్లలోకి అక్షయ్ కుమార్ 'మొహ్రా': 4కే వర్షన్‌లో రీ-రిలీజ్ ఎన్నికల ఏర్పాట్లపై సబ్ కలెక్టర్ కీలక సూచనలు దూసుకు వస్తున్న ఆర్నాబ్ తుఫాన్.... నేడు, రేపు విద్యాసంస్థలకు సెలవులు ... స్థానిక ఎన్నికలు-తుపానులపై సమీక్ష

బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం సమావేశాల్లో పాల్గొన్న తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

Select Suryaa Now
బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం సమావేశాల్లో పాల్గొన్న తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: ఢిల్లీలోని సంవిధాన్ సదన్‌ (పాత పార్లమెంట్ భవనం)లో అక్టోబర్ 26, 27 తేదీల్లో నిర్వహిస్తున్న 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం సమావేశాల్లో తెలంగాణ శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు కూడా పాల్గొన్నారు.సోమవారం ఉదయం శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్రిక్స్ సమావేశాల వేదికగా తెలంగాణ రాష్ట్ర గొంతును బలంగా వినిపిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రగతి, తెలంగాణకు సంబంధించిన కీలక అంశాలను సమావేశాల్లో వివరించడంతో పాటు, అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ ఖ్యాతిని మరింత పెంచేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. స్పీకర్ పర్యటన విజయవంతం కావాలని పలువురు ఆకాంక్షించారు.