గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి చేపల నాగమణి ఎన్నికల ప్రచారం!
ఎస్.రాయవరం, అక్టోబర్ 26, మేజర్ న్యూస్ :
ఎస్.రాయవరం మండలం లక్ష్మీపతి రాజుపేట గ్రామంలో గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి చేపల నాగమణి సోమవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఫ్యాను గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ శాసనసభ్యులు, పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త కంబాల జోగులు, సీనియర్ నాయకులు శ్రీపతి రాజు ప్రచారం చేశారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ఐదేళ్ల పాలనలో జగన్ పాలనను ప్రజల వద్దకే తీసుకువచ్చారని, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వచ్చి మూడేళ్లైనా నిత్యావసర ధరలు పెంచి, వాలంటీర్ వ్యవస్థను దూరం చేసి ప్రజలను కష్టపెడుతోందని, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని వారు విమర్శించారు. ఇవన్నీ మనసులో పెట్టుకుని ఫ్యాను గుర్తుకు ఓటేసి కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ప్రతి ఇంటి గడపకు తిరిగి చెప్పారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ మామిడి చంటి, గుడివాడ గ్రామ శాఖ అధ్యక్షులు వర్మ, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి చోడిపల్లి అప్పన్న, మండల పార్టీ కార్యదర్శి గనగళ్ల రాజేష్, జిల్లా సోషల్ మీడియా కార్యదర్శి చేపల రాజు, గుడివాడ, లక్ష్మీపతి రాజుపేట, కొత్త పోలవరం, కొత్త రేవు పోలవరం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొని జై జగన్ నినాదాలతో ప్రచారం చేశారు.