BREAKING
కోనసీమ–కాకినాడ వైపు దూసుకొస్తున్న ‘ఆర్నబ్’.. ల్యాండ్‌ఫాల్‌కు ముందు కీలక గంటలు ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు ప‌టిష్ట భ‌ద్ర‌త‌ : జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ ఎన్నికల వ్యయ పర్యవేక్షణలో నిర్లక్ష్యానికి తావులేకుండా విధులు నిర్వహించాలి జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో అర్న‌బ్ కంట్రోల్ రూమ్‌లు చుట్టుముట్టిన అతి భారీ వర్షాలు ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా 166 పునరావాస కేంద్రాలు.. ఓట్ బచావో–దేశ్ బచావో ర్యాలీని విజయవంతం చేయండి వైసిపి ప్రచారంలో దూసుకుపోతున్న చైర్మన్ అభ్యర్థి శ్రీలక్ష్మి రాజేష్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి క్యాండిల్ ర్యాలీతో పోలీసు అమరవీరులకు ఘనమైన నివాళులు టిప్పర్ వాహనాల బ్యాటరీ దొంగ అరెస్ట్-ఆత్మకూరు సిఐ జి. బాబులాల్ పవర్‌పేట సినిమాలో పడమటవీధి జానకిగా రితికా నాయక్.. పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే లుక్ విడుదల ఆదర్శ కుటుంబం వేదికపై వెంకీ మామ రీల్ కొడుకు ఎమోషనల్ స్పీచ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా స్పై కామెడీ జోరు.. ఐదు రోజుల్లో పాతిక కోట్ల వసూళ్లు దాటిన ఉడ్తా తీర్ నా జీవితంలో ఎదుర్కొన్న కష్టాల్లో కేవలం పది శాతమే సినిమాలో చూపించారు.. బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ సంచలన వ్యాఖ్యలు

వినాయక్ నగర్ డివిజన్ లో సమస్యలను పరిష్కరించాలి *ప్రజావాణిలో..మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి ఫిర్యాదు

Select Suryaa Now
వినాయక్ నగర్ డివిజన్ లో సమస్యలను పరిష్కరించాలి   *ప్రజావాణిలో..మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి ఫిర్యాదు

మల్కాజిగిరి, మేజర్ న్యూస్ : వినాయక్ నగర్ డివిజన్ పరిధిలో ప్రజలు ఎదుర్కొం టున్న పలు సమస్యలను పరిష్కరించాలని మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి కోరారు. సోమవారం ఆమె,  ప్రజావాణి కార్యక్రమానికి హజరై, మల్కాజిగిరి జోనల్ కమిషనర్‌ సంచత్ గంగ్వార్ కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, వినాయక్ నగర్ డివిజన్‌లో వీధి దీపాల నిర్వహణ సక్రమంగా లేదని, మరమ్మతులకు గురైన లైట్లను గుర్తించి వాటి స్థానంలో కొత్త లైట్లు ఏర్పాటు చేసేలా తగిన చర్యలు తీసు కోవాలని కోరారు. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, రోడ్లపై చెత్త వేస్తున్న వారిని గుర్తించేందుకు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించడం లేదా ఇతర పర్య వేక్షణ విధానాలను అమలు చేసి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే దోమల సమస్య తీవ్రంగా ఉందని, దోమల నివారణకు ఫాగింగ్ నిర్వహించడంతో పాటు బండ చెరువును శుభ్రపరిచి నీటి పరిశుభ్ర తకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, తరుణ ఎన్‌క్లేవ్ కాలనీకి చెందిన ప్రజల సమస్యలను, జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. జోనల్ కమీషనర్ ఈ ప్రాంతాన్ని పర్యటించి, వరదనీటి నాలాలు, వీధి దీపాలు, రహదారుల నిర్వహణను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకో వాలని ఆమె కోరారు.