తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు మూసివేత
ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: అర్నాబ్ తుఫాను ప్రభావంతో మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ముందస్తు భద్రతా చర్యలు చేపట్టింది. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అక్టోబర్27న ఘాట్ రోడ్డును పూర్తిగా మూసివేస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ తెలిపారు. మంగళవారం అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఘాట్ రోడ్డు మార్గాన్ని వినియోగించేందుకు అనుమతి ఉండదని, రాకపోకలకు మహామండపం మార్గాన్ని మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం సిబ్బంది అప్రమత్తంగా సేవలందిస్తారని తెలిపారు. భక్తులందరూ మార్గంలో చేసిన మార్పును గమనించి, ఆలయ భద్రతా సిబ్బందికి, అధికారులకు సహకరించాలని ఈవో విజ్ఞప్తి చేశారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.