డిప్యూటేషన్ లేకుండానే వేతనం
కాటారం, మేజర్ న్యూస్, ఎలాంటి డిప్యూటేషన్ ఉత్తర్వులు లేకపోయినా మరోచోట విధులు నిర్వహిస్తూ, రఘుపల్లి పాఠశాల నుంచే అక్రమంగా వేతనం పొందుతున్న ఉపాధ్యాయుడిపై, అందుకు సహకరిస్తున్న కాంప్లెక్స్ హెచ్‌ఎంపై తగిన చర్యలు తీసుకోవాలని కుల ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ మౌర్య, ఐతే బాపు డిమాండ్ చేశారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన అధికారులకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ కాటారం మండలం రఘుపల్లి ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయుడు ఎలాంటి అధికారిక ఆదేశాలు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా గత నెల రోజులుగా వేరే ప్రాంతంలో విధులకు హాజరవుతున్నారని తెలిపారు. పాఠశాలకు రాకపోయినప్పటికీ కాటారం మండలంలోని సదర్ కాంప్లెక్స్ హెచ్‌ఎం అక్రమ పద్ధతుల్లో సదరు ఉపాధ్యాయుడికి వేతనం ఇస్తూ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన ఉపాధ్యాయుడితో పాటు కాంప్లెక్స్ హెచ్‌ఎంపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు...
రిపోర్టర్ ,సుధాకర్ రెడ్డి, కాటారం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా