కూటమితోనే నగరాభివృద్ధి సాధ్యం... -అరుణోదయ నగర్ ప్రచారంలో అన్నా మల్లీశ్వరి
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : గత పాలకుల తిరుపతి నగరాన్ని వివక్షతకు గురిచేసి అభివృద్ధిని అడ్డుకున్నారని, కానీ నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంతో పాటు తిరుపతి నగరం మరింత అభివృద్ధికి సాధ్యమని 64వ డివిజన్ కూటమి కార్పొరేటర్ అభ్యర్థి అన్నా మల్లీశ్వరి తెలిపారు.
ప్రచారంలో భాగంగా సోమవారం జీవకోన అరుణోదయ కాలనీలో ఆమె ఇంటింట ప్రచారం నిర్వహించారు. స్థానిక మహిళల తో కలిసి ఆమె ప్రతి ఇంటికి వెళ్లి ఏం అక్క బాగున్నావా... ఏంటి సంగతులు ఏమన్నా సమస్యలు ఉన్నాయని ఆరా తీశారు. తమ కుటుంబానికి జీవకోన ప్రాంతానికి విడదీరాని అనుబంధం ఉందని, అందుకోసమే మరింత అభివృద్ధి చేసేందుకు తాను కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నానని ఈసారి ఎన్నికలలో తనకు అండగా నిలిచి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. తనతోపాటు మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జేబీ శ్రీనివాస్ కు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. కూటమి నాయకులు బుజ్జమ్మ, అహ్మద్, తులసి, లత రాజు, సోము, స్థానికలు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్