ఆరు నెలల్లో అభివృద్ధి చేసి చూపిస్తా -63వ డివిజన్ ప్రచారంలో పుష్పావతి హామీ
ఎడ్యుకేషన్ స్టాప్ రిపోర్టర్ : తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కూటమి ప్రభుత్వంతో డివిజన్లోని ప్రతి సమస్యను తన సమస్యగా తీసుకొని ఆరు నెలల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని, అందుకు ప్రజలందరూ తనకు అండగా నిలిచి అవకాశం ఇవ్వాలని 63వ డివిజన్ ఎన్డీఏ కార్పొరేటర్ అభ్యర్థి పుష్పావతి కోరారు. ప్రచారంలో భాగంగా సోమవారం జీవకోనలోని క్రాంతి నగర్ప్రాంతంలో ప్రజలతో మమేకమవుతూ ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచి ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తానని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రచారంలో ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. వెళ్లిన ప్రతిచోట వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నవంబర్ ఒకటో తేదీ జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జేబీ శ్రీనివాస్ కు సైకిల్ గుర్తుపై ఓటు వేసి, కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఆ డివిజన్ నాయకులు యువరాజు రెడ్డి, సుధాకర్, శ్రీనివాస్ యాదవ్, లక్ష్మి శివ, శశిరేఖ, పవన్, దేవి, భువన, చంద్ర, తేజ, ఈశ్వర్ పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్