BREAKING
ప్రతి పౌరుడు గర్వపడేలా అభివృద్ధి చేస్తాం -56వ డివిజన్ ప్రచారంలో బ్యాంకు శాంతమ్మ అన్నా మా ఓటు మీకే...గెలిచేది మీరే అన్న -ఆదం సుధాకర్ రెడ్డికి ప్రచారంలో ఓటర్లు భరోసా డివిజన్ రూపు రేఖలు మారుస్తా... -60వ డివిజన్ ప్రచారంలో ఆకేపాటీ సుభాషిణి మీ వాడిగా నిత్యం అందుబాటులో ఉంటా... -59వ డివిజన్ ప్రచారంలో జగదీష్ ప్రజలకు హా టిడిపిని గెలిపించి అభివృద్ధికి సహకరించండి -57వ డివిజన్ ప్రచారంలో గాలి కావ్య విజ్ఞప్తి ఆరు నెలల్లో అభివృద్ధి చేసి చూపిస్తా -63వ డివిజన్ ప్రచారంలో పుష్పావతి హామీ మా తమ్ముడికి అవకాశం ఇవ్వండి -మాధవ నగర్ లో అన్నా అనిత ప్రచారం కూటమితోనే నగరాభివృద్ధి సాధ్యం... -అరుణోదయ నగర్ ప్రచారంలో అన్నా మల్లీశ్వరి ఫీజుల పేరుతో బీఈడీ ప్రవేశాలు నిరాకరించడమా...! నేటి రాశి ఫలాలు –27 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 27 అక్టోబర్ 2026 ఆర్నబ్ తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలి.. అగ్రిస్టాక్‌పై జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్.. రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి కృష్ణా జిల్లా సాధారణ పరిశీలకునిగా వి. అభిషేక్ నియామకం

మా తమ్ముడికి అవకాశం ఇవ్వండి -మాధవ నగర్ లో అన్నా అనిత ప్రచారం

Select Suryaa Now
మా తమ్ముడికి అవకాశం ఇవ్వండి  -మాధవ నగర్ లో అన్నా అనిత ప్రచారం

ఎడ్యుకేషన్ స్టాప్ రిపోర్టర్ : తమ తండ్రి అన్నా రామచంద్రయ్య అడుగుజాడల్లో నడుస్తూ తమ కుటుంబం ప్రజాసేవకే అంకితమయ్యామని, గతంలో తనకు అవకాశం కల్పించారని, నేడు మా తమ్ముడు అన్నా లోకేష్ కు కార్పొరేటర్ గా ఒక అవకాశం ఇవ్వాలని టిడిపి రాష్ట్ర కార్యదర్శి అన్నా అనిత విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో భాగంగా 12వ క్లస్టర్, 66వ డివిజన్ పరిధిలోని మాధవ్ నగర్, ఎస్ ఎల్ వి నగర్ లో కుటమి అభ్యర్థి అన్నా లోకేష్ సోమవారం ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారానికి అన్నా రామకృష్ణతోపాటు అన్నా అనిత హాజరై ప్రతిసారి తమకు అండగా నిలుస్తున్న జీవకోన ప్రజలకు రుణపడి ఉంటామని, ఈసారి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తమ్ముడు లోకేష్ ను ఆదరించాలని అభ్యర్థించారు. నవంబర్ ఒకటో తేదీ జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కూటమి తరపున మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జెబి శ్రీనివాస్, కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అన్నా లోకేష్ కు సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు సిద్దయ్య జయమ్మ, డాన్స్ శ్రీను, శేఖర్ యాదవ్, సుబ్రహ్మణ్యం, గుర్రప్ప, మురళి, నరసింహులు, దాము, స్థానిక మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సీఎం గౌడ్  తిరుపతి స్టాప్ రిపోర్టర్