కృష్ణా జిల్లా సాధారణ పరిశీలకునిగా వి. అభిషేక్ నియామకం
మచిలీపట్నం, మేజర్ న్యూస్ : రాష్ట్రంలో నిర్వహిస్తున్న రెండో సాధారణ పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా సాధారణ పరిశీలకునిగా ఐఏఎస్ అధికారి, పోలవరం ప్రాజెక్టు పరిపాలకుడు వి. అభిషేక్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించింది. గతంలో జిల్లా సాధారణ పరిశీలకునిగా నియమితులైన ఐఏఎస్ అధికారి, సెకండరీ హెల్త్ డైరెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు నియామక ఉత్తర్వులను పాక్షికంగా సవరిస్తూ ఆయన స్థానంలో వి. అభిషేక్‌ను నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నూతనంగా నియమితులైన సాధారణ పరిశీలకులు వి. అభిషేక్ సోమవారం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ డీకే బాలాజిని ఆయన ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం, కృష్ణాజిల్లా.