BREAKING
అన్నా మా ఓటు మీకే...గెలిచేది మీరే అన్న -ఆదం సుధాకర్ రెడ్డికి ప్రచారంలో ఓటర్లు భరోసా డివిజన్ రూపు రేఖలు మారుస్తా... -60వ డివిజన్ ప్రచారంలో ఆకేపాటీ సుభాషిణి మీ వాడిగా నిత్యం అందుబాటులో ఉంటా... -59వ డివిజన్ ప్రచారంలో జగదీష్ ప్రజలకు హా టిడిపిని గెలిపించి అభివృద్ధికి సహకరించండి -57వ డివిజన్ ప్రచారంలో గాలి కావ్య విజ్ఞప్తి ఆరు నెలల్లో అభివృద్ధి చేసి చూపిస్తా -63వ డివిజన్ ప్రచారంలో పుష్పావతి హామీ మా తమ్ముడికి అవకాశం ఇవ్వండి -మాధవ నగర్ లో అన్నా అనిత ప్రచారం కూటమితోనే నగరాభివృద్ధి సాధ్యం... -అరుణోదయ నగర్ ప్రచారంలో అన్నా మల్లీశ్వరి ఫీజుల పేరుతో బీఈడీ ప్రవేశాలు నిరాకరించడమా...! నేటి రాశి ఫలాలు –27 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 27 అక్టోబర్ 2026 ఆర్నబ్ తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలి.. అగ్రిస్టాక్‌పై జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్.. రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి కృష్ణా జిల్లా సాధారణ పరిశీలకునిగా వి. అభిషేక్ నియామకం అవినీతి నిర్మూలనలో ప్రజలు భాగస్వాములు కావాలి

అవినీతి నిర్మూలనలో ప్రజలు భాగస్వాములు కావాలి

Select Suryaa Now
అవినీతి నిర్మూలనలో ప్రజలు భాగస్వాములు కావాలి

విజయవాడ క్రైం, మేజర్ న్యూస్ : అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు పిలుపునిచ్చారు. విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) రూపొందించిన ప్రత్యేక అవగాహన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం అడిగినా, అవినీతికి పాల్పడినా ప్రజలు భయపడకుండా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. పారదర్శక పాలనకు అవినీతి నిర్మూలన ఎంతో అవసరమని, సమాజంలో అవినీతి రహిత వాతావరణం నెలకొల్పేందుకు ప్రజల్లో చైతన్యం పెరగాలని పేర్కొన్నారు. అవినీతి నిర్మూలనలో ప్రజలు తమ వంతు బాధ్యతగా సహకరించాలని కోరారు. ఫిర్యాదుల కోసం ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌ 1064, వాట్సాప్‌ నంబర్‌ 9440440057, ఈ-మెయిల్‌ acb@ap.gov.in లేదా 0866-2428770 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు కృష్ణకాంత్ పటేల్, కె.జి.వి. సరిత, అదనపు ఎస్పీ స్రవంతి రాయ్, డీఎస్పీ సుబ్బారావు, ఇన్‌స్పెక్టర్ ఎం.వి.ఎస్. నాగరాజు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.