BREAKING
ప్రతి పౌరుడు గర్వపడేలా అభివృద్ధి చేస్తాం -56వ డివిజన్ ప్రచారంలో బ్యాంకు శాంతమ్మ అన్నా మా ఓటు మీకే...గెలిచేది మీరే అన్న -ఆదం సుధాకర్ రెడ్డికి ప్రచారంలో ఓటర్లు భరోసా డివిజన్ రూపు రేఖలు మారుస్తా... -60వ డివిజన్ ప్రచారంలో ఆకేపాటీ సుభాషిణి మీ వాడిగా నిత్యం అందుబాటులో ఉంటా... -59వ డివిజన్ ప్రచారంలో జగదీష్ ప్రజలకు హా టిడిపిని గెలిపించి అభివృద్ధికి సహకరించండి -57వ డివిజన్ ప్రచారంలో గాలి కావ్య విజ్ఞప్తి ఆరు నెలల్లో అభివృద్ధి చేసి చూపిస్తా -63వ డివిజన్ ప్రచారంలో పుష్పావతి హామీ మా తమ్ముడికి అవకాశం ఇవ్వండి -మాధవ నగర్ లో అన్నా అనిత ప్రచారం కూటమితోనే నగరాభివృద్ధి సాధ్యం... -అరుణోదయ నగర్ ప్రచారంలో అన్నా మల్లీశ్వరి ఫీజుల పేరుతో బీఈడీ ప్రవేశాలు నిరాకరించడమా...! నేటి రాశి ఫలాలు –27 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 27 అక్టోబర్ 2026 ఆర్నబ్ తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలి.. అగ్రిస్టాక్‌పై జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్.. రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి కృష్ణా జిల్లా సాధారణ పరిశీలకునిగా వి. అభిషేక్ నియామకం

అన్నా మా ఓటు మీకే...గెలిచేది మీరే అన్న -ఆదం సుధాకర్ రెడ్డికి ప్రచారంలో ఓటర్లు భరోసా

Select Suryaa Now
అన్నా మా ఓటు మీకే...గెలిచేది మీరే అన్న -ఆదం సుధాకర్ రెడ్డికి ప్రచారంలో ఓటర్లు భరోసా

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ఆదం కుటుంబంతో తమకు విడదీయరాని అనుబంధం ఉందని, జరగబోయే కార్పొరేషన్ ఎన్నికలలో మీకు అండగా నిలిచి ఓటు వేసి గెలిపించుకుంటామని 60వ డివిజన్ ఇండిపెండెంట్ అభ్యర్థి ఆదం సుధాకర్ రెడ్డికి స్థానిక ప్రజలు భరోసా ఇచ్చారు. ప్రచారంలో భాగంగా 60వ డివిజన్ పరిధిలోని సుభాష్ నగర్ ప్రాంతంలో సోమవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కరపత్రాలు పంచుతూ గతంలో పనిచేసిన అనుభవంతో చేయబోయే అభివృద్ధిని ప్రతి మహిళకు వివరిస్తూ జరగబోయే ఎన్నికలలో వరుస  నెంబర్ 3 గ్యాస్ స్టవ్ పై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ కుటుంబం నుంచి రాజకీయంలోకి రాణించిన మీ అందరికీ రుణపడి ఉంటానని, డివిజన్ లో ప్రతి సమస్య తనకు తెలుసని తప్పకుండా సమస్యలన్నీ పరిష్కరించి అండగా నిలుస్తాను ఆదరించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో ఏం మణి, పూర్ణచంద్ర, ఏ రాజశేఖర్ రెడ్డి, రామచంద్రారెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, పొన్నం ప్రసాద్ స్థానిక మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్