BREAKING
ప్రతి పౌరుడు గర్వపడేలా అభివృద్ధి చేస్తాం -56వ డివిజన్ ప్రచారంలో బ్యాంకు శాంతమ్మ అన్నా మా ఓటు మీకే...గెలిచేది మీరే అన్న -ఆదం సుధాకర్ రెడ్డికి ప్రచారంలో ఓటర్లు భరోసా డివిజన్ రూపు రేఖలు మారుస్తా... -60వ డివిజన్ ప్రచారంలో ఆకేపాటీ సుభాషిణి మీ వాడిగా నిత్యం అందుబాటులో ఉంటా... -59వ డివిజన్ ప్రచారంలో జగదీష్ ప్రజలకు హా టిడిపిని గెలిపించి అభివృద్ధికి సహకరించండి -57వ డివిజన్ ప్రచారంలో గాలి కావ్య విజ్ఞప్తి ఆరు నెలల్లో అభివృద్ధి చేసి చూపిస్తా -63వ డివిజన్ ప్రచారంలో పుష్పావతి హామీ మా తమ్ముడికి అవకాశం ఇవ్వండి -మాధవ నగర్ లో అన్నా అనిత ప్రచారం కూటమితోనే నగరాభివృద్ధి సాధ్యం... -అరుణోదయ నగర్ ప్రచారంలో అన్నా మల్లీశ్వరి ఫీజుల పేరుతో బీఈడీ ప్రవేశాలు నిరాకరించడమా...! నేటి రాశి ఫలాలు –27 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 27 అక్టోబర్ 2026 ఆర్నబ్ తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలి.. అగ్రిస్టాక్‌పై జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్.. రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి కృష్ణా జిల్లా సాధారణ పరిశీలకునిగా వి. అభిషేక్ నియామకం

టిడిపిని గెలిపించి అభివృద్ధికి సహకరించండి -57వ డివిజన్ ప్రచారంలో గాలి కావ్య విజ్ఞప్తి

Select Suryaa Now
టిడిపిని గెలిపించి అభివృద్ధికి సహకరించండి -57వ డివిజన్ ప్రచారంలో గాలి కావ్య విజ్ఞప్తి

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి టిడిపి మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్, కార్పొరేటర్ అభ్యర్థి తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని గాలి కావ్య విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో భాగంగా సోమవారం కొర్లగుంట ప్రాంతంలో కుటమి నాయకులతో కలిసి జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్లో ప్రతి ఇంటికి వెళ్లి స్థానిక మహిళనైన తనకు ఈ ప్రాంతంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్ని చూశానని, తనకు ఒక్క అవకాశం ఇస్తే అన్ని సమస్యలను ఇట్టే పరిష్కరించి మీ ఆదరాభిమానాలను పొందుతానని తెలిపారు. వెళ్లిన ప్రతిచోట ఆమెకు కర్పూర హారతులు పట్టి మేమున్నాము మీ వెంట మీరు ముందు నడవండి మీకు ఓట్లు వేసి గెలిపించే బాధ్యత మాది అని ఓటర్లు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం రాజేష్, ఎం గుణ, కళా కవిత కల్పన ఉమా వరదరాజులు, వెంకటరమణ రాజు, రామ్మూర్తి, రెడ్డప్ప, వేణు, రుద్ర, నవీన్, కిరణ్ (కృష్ణా సప్లయర్స్), హేమంత్, శంకర్, ముని మోహన్, గణేష్ మార్కెట్, శశి, డిల్లీ, రాజేష్, మున్నా, వర్షిత్, సంతోష్, తరుంటేజ, హరీష్, షారుక్ హేమంత్ (అక్కి, మహీ), సాయి పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్