రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి
స్టేషన్ ఘనపూర్, మేజర్ న్యూస్,
మండలంలోని పామునూరు గ్రామంలో సర్పంచ్ పోలేపెళ్లి సంపత్ రెడ్డి అధ్యక్షతన రైతులకు గ్రామసభ నిర్వహించారు.సోమవారం జరిగిన ఈ గ్రామ సభలో సర్పంచ్ మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సందర్భంగా రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని అన్నారు.రాష్ట్రంలో నీటి కొరత ఏర్పడడం వల్ల రైతులు వరి పంట వేసి నష్టపోవద్దని పేర్కోన్నారు.బోరు బావుల్లో సాగునీటి లభ్యత తగ్గుతున్నందున
రైతులు నీటి వినియోగంపై శ్రద్ధ వహించాలన్నారు.వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.
ప్రత్యామ్నాయ పంటలు వేయడం ద్వారా నష్టాలను తగ్గించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో
ఉపసర్పంచ్ తాళ్లపల్లి జయ శివకుమార్,పంచాయతీ కార్యదర్శి రవీందర్ గౌడ్, ఏపీవో ప్రేమయ్య,వ్యవసాయ విస్తరణాధికారి ప్రతిభ,వార్డు సభ్యులు,రైతులు పాల్గొన్నారు.
రిపోర్టర్: మోహన్, స్టేషన్ ఘన్పూర్, జనగామ జిల్లా