BREAKING
అన్నా మా ఓటు మీకే...గెలిచేది మీరే అన్న -ఆదం సుధాకర్ రెడ్డికి ప్రచారంలో ఓటర్లు భరోసా డివిజన్ రూపు రేఖలు మారుస్తా... -60వ డివిజన్ ప్రచారంలో ఆకేపాటీ సుభాషిణి మీ వాడిగా నిత్యం అందుబాటులో ఉంటా... -59వ డివిజన్ ప్రచారంలో జగదీష్ ప్రజలకు హా టిడిపిని గెలిపించి అభివృద్ధికి సహకరించండి -57వ డివిజన్ ప్రచారంలో గాలి కావ్య విజ్ఞప్తి ఆరు నెలల్లో అభివృద్ధి చేసి చూపిస్తా -63వ డివిజన్ ప్రచారంలో పుష్పావతి హామీ మా తమ్ముడికి అవకాశం ఇవ్వండి -మాధవ నగర్ లో అన్నా అనిత ప్రచారం కూటమితోనే నగరాభివృద్ధి సాధ్యం... -అరుణోదయ నగర్ ప్రచారంలో అన్నా మల్లీశ్వరి ఫీజుల పేరుతో బీఈడీ ప్రవేశాలు నిరాకరించడమా...! నేటి రాశి ఫలాలు –27 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 27 అక్టోబర్ 2026 ఆర్నబ్ తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలి.. అగ్రిస్టాక్‌పై జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్.. రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి కృష్ణా జిల్లా సాధారణ పరిశీలకునిగా వి. అభిషేక్ నియామకం అవినీతి నిర్మూలనలో ప్రజలు భాగస్వాములు కావాలి

సెల్ఫోన్ సంకేతాలు లేక అవస్థలు!

Select Suryaa Now
సెల్ఫోన్ సంకేతాలు లేక అవస్థలు!

గణపురం, మేజర్ న్యూస్, గణపురం మండలం నగరంపల్లి గ్రామంలో సెల్‌ఫోన్‌ సంకేతాలు సరిగా అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫోన్‌ మాట్లాడాలన్నా, అంతర్జాల సేవలు వినియోగించుకోవాలన్నా సమస్యలు ఎదురవుతున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు.అత్యవసర సమయాల్లో కుటుంబ సభ్యులకు, వైద్య సేవలకు, ఇతర అధికారులకు ఫోన్‌ చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెల్‌ఫోన్‌ సంకేతాలు సరిగా అందకపోవడంతో కొన్ని కుటుంబాలు అదనపు ఖర్చు భరిస్తూ వైఫై సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోందని చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో సెల్‌ఫోన్‌ సేవలు విద్య, ఉపాధి, వ్యాపారం, అత్యవసర సమాచార మార్పిడికి ఎంతో అవసరమని గ్రామస్థులు పేర్కొంటున్నారు. అయినప్పటికీ నగరంపల్లిలో మెరుగైన సంకేతాలు అందకపోవడం ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సంబంధిత టెలికాం సంస్థలు నగరంపల్లి గ్రామంలో సెల్‌ఫోన్‌ సంకేతాల లభ్యతను పరిశీలించి, అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. గ్రామస్థులకు అంతరాయం లేకుండా నాణ్యమైన సెల్‌ఫోన్‌ సేవలు అందేలా అధికారులు, టెలికాం సంస్థలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

రిపోర్టర్ ; ఎల్లయ్య ,గణపురం జయశంకర్ భూపాలపల్లి జిల్లా