నేడు ఆర్టీసీ డయల్ యువర్ డిఎం
నారాయణపేట, సూర్యన్యూస్ : నారాయణపేట ఆర్టీసీ డిపో పరిధిలో ప్రయాణికుల సమస్యలను తెలుసుకునేందుకు మంగళవారం డయల్ యువర్ డిఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్థానిక డిపో మేనేజర్ యాకన్న ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణ, ఇతర మండల, గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా సమస్యలను నేరుగా ఫోన్ చేసి తెలియజేయాలని, ప్రజా రవాణా మెరుగుపరుచుకునేందుకు అవసరమైన సూచనలు, సలహాలు అందించాలన్నారు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 7382826293 నెంబర్ కు ఫోన్ చేయాలని కోరారు.
– రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్, నారాయణపేట.