BREAKING
ప్రతి పౌరుడు గర్వపడేలా అభివృద్ధి చేస్తాం -56వ డివిజన్ ప్రచారంలో బ్యాంకు శాంతమ్మ అన్నా మా ఓటు మీకే...గెలిచేది మీరే అన్న -ఆదం సుధాకర్ రెడ్డికి ప్రచారంలో ఓటర్లు భరోసా డివిజన్ రూపు రేఖలు మారుస్తా... -60వ డివిజన్ ప్రచారంలో ఆకేపాటీ సుభాషిణి మీ వాడిగా నిత్యం అందుబాటులో ఉంటా... -59వ డివిజన్ ప్రచారంలో జగదీష్ ప్రజలకు హా టిడిపిని గెలిపించి అభివృద్ధికి సహకరించండి -57వ డివిజన్ ప్రచారంలో గాలి కావ్య విజ్ఞప్తి ఆరు నెలల్లో అభివృద్ధి చేసి చూపిస్తా -63వ డివిజన్ ప్రచారంలో పుష్పావతి హామీ మా తమ్ముడికి అవకాశం ఇవ్వండి -మాధవ నగర్ లో అన్నా అనిత ప్రచారం కూటమితోనే నగరాభివృద్ధి సాధ్యం... -అరుణోదయ నగర్ ప్రచారంలో అన్నా మల్లీశ్వరి ఫీజుల పేరుతో బీఈడీ ప్రవేశాలు నిరాకరించడమా...! నేటి రాశి ఫలాలు –27 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 27 అక్టోబర్ 2026 ఆర్నబ్ తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలి.. అగ్రిస్టాక్‌పై జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్.. రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి కృష్ణా జిల్లా సాధారణ పరిశీలకునిగా వి. అభిషేక్ నియామకం

డివిజన్ రూపు రేఖలు మారుస్తా... -60వ డివిజన్ ప్రచారంలో ఆకేపాటీ సుభాషిణి

Select Suryaa Now
డివిజన్ రూపు రేఖలు మారుస్తా...  -60వ డివిజన్ ప్రచారంలో ఆకేపాటీ సుభాషిణి

ఎడ్యుకేషన్ స్టార్ట్ రిపోర్టర్ : రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధిక నిధులు రాబట్టి డివిజన్ రూపులేఖలు మార్చి మరింత అభివృద్ధి చేస్తానని 60వ డివిజన్ ఎన్డీఏ కూటమి కార్పొరేటర్ అభ్యర్థి ఆకేపాటీ సుభాషిణి తెలిపారు. ప్రచారంలో భాగంగా డివిజన్ పరిధిలోని అక్కరంపల్లి, సుబ్బారెడ్డి, నగర్, సుభాష్ నగర్, నవోదయ కాలనీ ప్రాంతాలలో టిడిపి యూనిట్ ఇన్చార్జి నరేష్ రెడ్డి, జనసేన నాయకులు హేమ కుమార్ తో కలిసి ఆమె ఇంటింట ప్రచారం చేపట్టారు. ప్రతి ఇంటికి వెళ్లి డివిజన్లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కుటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తిరుపతి అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, ఆయన ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఇంటింటికి తిరిగి కోటపై ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ కు సైకిల్ గుర్తుపై, కార్పొరేటర్ అభ్యర్థి ఆకేపాటీ సుభాషిణికి గ్లాసు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. అలాగే సాయంత్రం కుటమి నాయకులతో కలిసి డివిజన్ లో తిరుగుతూ ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్ధు, రాధా, వంశీ, భీమా, రవి, రాధ, దుర్గ, చందన కూటమి నాయకులు పాల్గొన్నారు.

 సీఎం రోడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్