BREAKING
ఆరు నెలల్లో అభివృద్ధి చేసి చూపిస్తా -63వ డివిజన్ ప్రచారంలో పుష్పావతి హామీ మా తమ్ముడికి అవకాశం ఇవ్వండి -మాధవ నగర్ లో అన్నా అనిత ప్రచారం కూటమితోనే నగరాభివృద్ధి సాధ్యం... -అరుణోదయ నగర్ ప్రచారంలో అన్నా మల్లీశ్వరి ఫీజుల పేరుతో బీఈడీ ప్రవేశాలు నిరాకరించడమా...! నేటి రాశి ఫలాలు –27 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 27 అక్టోబర్ 2026 ఆర్నబ్ తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలి.. అగ్రిస్టాక్‌పై జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్.. రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి కృష్ణా జిల్లా సాధారణ పరిశీలకునిగా వి. అభిషేక్ నియామకం అవినీతి నిర్మూలనలో ప్రజలు భాగస్వాములు కావాలి ఎన్నికల తనిఖీల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు విద్యుత్ బకాయిల వసూళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలి మానవత్వాన్ని చాటుకున్న దామర ఎస్సై ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్ల పరిశీలన... - లయోలా కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ తనిఖీ

మచిలీపట్నం అభివృద్ధికి కూటమికి మద్దతివ్వండి.. : మంత్రి కొల్లు రవీంద్ర

Select Suryaa Now
మచిలీపట్నం అభివృద్ధికి కూటమికి మద్దతివ్వండి.. : మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం, మేజర్ న్యూస్ : మచిలీపట్నం నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా మంత్రి కొల్లు రవీంద్ర వివిధ వర్గాల మద్దతు కూడగడుతున్నారు. ఇందులో భాగంగా మచిలీపట్నం బార్ అసోసియేషన్ సభ్యులను, న్యాయవాదులను కలిసి కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదాతో పాటు వివిధ డివిజన్లలో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నగర అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అబ్దుల్ అబీదాకు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం నగరంలోని పలు సంఘాల నాయకులతోనూ సమావేశమై కూటమి అభ్యర్థుల విజయానికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మచిలీపట్నంలో తాగునీటి సమస్య పరిష్కారానికి గతంలో ప్రత్యేక దృష్టి సారించామని, ప్రతి ఇంటికీ తాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేశామని తెలిపారు. రహదారులు, మురుగునీటి పారుదల వ్యవస్థ అభివృద్ధికి సుమారు రూ.100 కోట్ల నిధులు తీసుకొచ్చామని, ప్రభుత్వం మారడంతో పలు పనులకు ఆటంకం ఏర్పడిందని పేర్కొన్నారు. నగర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజలు కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం, కృష్ణాజిల్లా.