BREAKING
మధ్యాహ్నం వరకు బయటకు రావద్దు మక్కపేటలో టీడీపీ–వైసీపీకి షాక్! పోటీ నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థుల ఉపసంహరణ.. బరిలో బీఎస్పీ, స్వతంత్ర అభ్యర్థి ఇంద్రేశంలో మాజీ ప్రజాప్రతినిధి ఇష్టారాజ్యం! అర్నబ్’ ప్రభావంతో 60కి పైగా రైళ్లు రద్దు: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అత్యవసర సూచనలు! ఉద్యోగం పేరుతో నమ్మించి.. రహస్య కెమెరాలతో బ్లాక్‌మెయిల్‌.. మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి ల్యాండ్‌ఫాల్ దిశగా తీవ్ర తుఫాన్ ‘ఆర్నబ్’: తీరం దాటినా విధ్వంసం ఆగదు .. రాష్ట్ర ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర హెచ్చరికలు! ఆదర్శ కుటుంబం ప్రీ రిలీజ్ వేడుకలో వెంకటేష్, త్రివిక్రమ్ సందడి.. సిక్సర్ కొట్టబోతున్నామంటూ ధీమా! ఓటీటీలోకి ఫహద్ ఫాజిల్ డిఫరెంట్ ఎంటర్‌టైనర్.. స్ట్రీమింగ్ డేట్ అప్‌డేట్ ఇదే! పసిడి ప్రియులకు భారీ షాక్.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. తులంపై ఎంతంటే? శాంతి భద్రతల పరిరక్షణ మా ధ్యేయం.. రూరల్ సీఐ చిరంజీవి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నమిత గ్రాండ్ రీఎంట్రీ.. గుర్తుపట్టలేనంతగా మారిన వైనం మార్కెట్ కమిటీ అభివృద్ధికి మంత్రి హామీ ఇందిరమ్మ ఇళ్ల కోసం తీవ్ర చలిలోపేద మహిళల రాత్రంతా నిరసన.. న్యాయం జరిగే వరకు కదిలేది లేదు! ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కీర్తి జావిద్ ప్రచారం వికారాబాద్ జిల్లాలో 20 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటిస్తూ జీవో జారీ

ఫొటో ఓటర్ స్లిప్పు తప్పనిసరి కాదు.. : కమిషనర్ ధ్యానచంద్ర స్పష్టీకరణ

Select Suryaa Now
ఫొటో ఓటర్ స్లిప్పు తప్పనిసరి కాదు.. : కమిషనర్ ధ్యానచంద్ర స్పష్టీకరణ

విజయవాడ కార్పొరేషన్, మేజర్ న్యూస్ : ఫొటో ఓటర్ స్లిప్పు కలిగి ఉండటం ఓటు వేయడానికి తప్పనిసరి కాదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర స్పష్టం చేశారు. సోమవారం ఉదయం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వివరించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన సర్క్యులర్ నెం. 173/ఎస్ఈసి-ఎఫ్1/2026 ప్రకారం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లకు ఫొటో ఓటర్ స్లిప్పుల ముద్రణ, పంపిణీకి సంబంధించిన మార్గదర్శకాలను వివరించారు. ఓటర్లు తమ పోలింగ్ కేంద్రం నంబరు, ఓటరు జాబితాలోని క్రమ సంఖ్యను తెలుసుకునేందుకు ఫొటో ఓటర్ స్లిప్పులు ఉపయోగపడతాయని తెలిపారు. ఎన్నికల సిబ్బంది నిబంధనల ప్రకారం స్లిప్పులను పంపిణీ చేయాలని, ఈ ప్రక్రియలో పారదర్శకతతో పాటు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఫొటో ఓటర్ స్లిప్పు లేని కారణంగా ఏ ఓటరినీ ఓటు హక్కుకు అనర్హుడిగా పరిగణించరాదని స్పష్టం చేశారు. అయితే ఓటు వేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదించిన ఓటరు గుర్తింపు కార్డు లేదా ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాన్ని తప్పనిసరిగా చూపించాలని తెలిపారు. ఫొటో ఓటర్ స్లిప్పును గుర్తింపు పత్రంగా పరిగణించరాదని వివరించారు. ఈ సమావేశంలో మేయర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి, పీడీ హౌసింగ్ రజినీ కుమారి, అదనపు కమిషనర్లు కె. శకుంతల, జి. సృజన, అసిస్టెంట్ కమిషనర్ డి.ఎస్.ఎస్. శ్రీనివాస్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు యారాం మనోహర్ రాజా (భారత జాతీయ కాంగ్రెస్), ఈ.వి. నారాయణ (సీపీఐ), పి. ముషరఫ్ రావు (సీపీఎం), ఎం. నవీన్ కుమార్ (బీజేపీ), ఎం. వినోద్ కుమార్ (బీఎస్పీ), నవనీతం సాయిబాబా (తెలుగుదేశం పార్టీ), గుండె సందీప్ పాల్ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ), పి. పరమేశ్వరరావు (ఆమ్ ఆద్మీ పార్టీ), జి. జగన్నాథం శ్రీనివాస్ (జనసేన పార్టీ) తదితరులు పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.