ఇందిరమ్మ ఇళ్ల కోసం తీవ్ర చలిలోపేద మహిళల రాత్రంతా నిరసన.. న్యాయం జరిగే వరకు కదిలేది లేదు!
సూర్య బెజ్జుర్:కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం ఉట్స్ సారంగపల్లి గ్రామపంచాయతీ ఎదుట ఇందిరమ్మ ఇళ్లు తమకు మంజూరు కాలేదని ఆరోపిస్తూ పేద కుటుంబాల మహిళలు నిన్నటి నుంచి ఆందోళన, నిరసన చేపట్టి రాత్రంతా అక్కడే బస చేసి జాగరణ చేశారు. అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేయకుండా ధనవంతులకు కేటాయిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.రాత్రి 11 గంటల సమయంలో పోలీసులు అక్కడికి చేరుకుని జీపీ ఎదుట నిరసన కొనసాగించవద్దని సూచించినట్లు మహిళలు తెలిపారు. అయితే తమకు న్యాయం జరిగే వరకు గ్రామపంచాయతీ ఎదుట నుంచి కదిలేది లేదని, తమ గోడును ఎస్సైకి విన్నవించారు.అర్హులైన నిరుపేద కుటుంబాలను క్షేత్రస్థాయిలో గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, ఇళ్ల కేటాయింపులపై అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని,3కుటుంబాలు,మౌనిక, సులోచన,సునీత మహిళలు డిమాండ్ చేస్తున్నారు.