పద్మారావు నగర్ డివిజన్ లో పట్టభద్రుల MLC ఓటర్ నమోదు - ఎంపీ సునీల్
సికింద్రాబాద్ : సనత్ నగర్ నియోజకవర్గం పద్మారావు నగర్ డివిజన్, డాక్టర్ కోట నీలిమ గారి ఆదేశాల మేరకు, ఎంపీ సునీల్, పద్మారావు నగర్ డివిజన్ ఆస్పిరెంట్ మెరుగు జగదీశ్వర్, పద్మారావు నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల MLC ఎన్నికల ఓటర్ నమోదు కార్యక్రమం పద్మారావు నగర్ డివిజన్ సర్దార్ పటేల్ కాలేజ్ వద్ద నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సనత్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ & TPCC వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ గారి నేతృత్వంలో MLC పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమంలో భారీ సంఖ్యలో పట్టభద్రులు ఓటర్ నమోదు చేసుకోవడం జరిగింది.
*ఈ సందర్భంగా పట్టభద్రులతో మాట్లాడుతూ — ఓటు నమోదు చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి గారిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా పట్టభద్రులకు విజ్ఞప్తి చేయడం జరిగింది.*
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యాదవ్ చారి, తోటా రామకృష్ణ, వేద ప్రకాష్ యాదవ్, వై.ఎం. విజయ్ కుమార్, కృపా ప్రసాద్, లవ, సుధారాణి, నాగరాణి, మావిడాల బాలకృష్ణ, దినేష్ కుమార్, మహేష్, సిహెచ్ శివకుమార్, కల్పన, వీరస్వామి, ప్రవీణ్ చారి, ఆనంద్ కొండ్ర, రమేష్ యాదవ్, నారాయణ పాండు తదితరులు పాల్గొన్నారు.