BREAKING
ములకలచెరువు మండలంలోని మొత్తం 13 ఎంపీటీసీ స్థానాలకు గాను ఏకగ్రీవమైన 8 స్థానాల.. ఇంటింటికీ ప్రచారం.. ఓటర్లను కలుస్తున్న నూరి ఇక్బాల్ మధ్యాహ్నం వరకు బయటకు రావద్దు మక్కపేటలో టీడీపీ–వైసీపీకి షాక్! పోటీ నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థుల ఉపసంహరణ.. బరిలో బీఎస్పీ, స్వతంత్ర అభ్యర్థి ఇంద్రేశంలో మాజీ ప్రజాప్రతినిధి ఇష్టారాజ్యం! అర్నబ్’ ప్రభావంతో 60కి పైగా రైళ్లు రద్దు: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అత్యవసర సూచనలు! ఉద్యోగం పేరుతో నమ్మించి.. రహస్య కెమెరాలతో బ్లాక్‌మెయిల్‌.. మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి ల్యాండ్‌ఫాల్ దిశగా తీవ్ర తుఫాన్ ‘ఆర్నబ్’: తీరం దాటినా విధ్వంసం ఆగదు .. రాష్ట్ర ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర హెచ్చరికలు! ఆదర్శ కుటుంబం ప్రీ రిలీజ్ వేడుకలో వెంకటేష్, త్రివిక్రమ్ సందడి.. సిక్సర్ కొట్టబోతున్నామంటూ ధీమా! ఓటీటీలోకి ఫహద్ ఫాజిల్ డిఫరెంట్ ఎంటర్‌టైనర్.. స్ట్రీమింగ్ డేట్ అప్‌డేట్ ఇదే! పసిడి ప్రియులకు భారీ షాక్.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. తులంపై ఎంతంటే? శాంతి భద్రతల పరిరక్షణ మా ధ్యేయం.. రూరల్ సీఐ చిరంజీవి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నమిత గ్రాండ్ రీఎంట్రీ.. గుర్తుపట్టలేనంతగా మారిన వైనం మార్కెట్ కమిటీ అభివృద్ధికి మంత్రి హామీ ఇందిరమ్మ ఇళ్ల కోసం తీవ్ర చలిలోపేద మహిళల రాత్రంతా నిరసన.. న్యాయం జరిగే వరకు కదిలేది లేదు!

శాంతి భద్రతల పరిరక్షణ మా ధ్యేయం.. రూరల్ సీఐ చిరంజీవి

Select Suryaa Now
శాంతి భద్రతల పరిరక్షణ మా ధ్యేయం.. రూరల్ సీఐ చిరంజీవి

శాంతి భద్రతల పరిరక్షణ మా ధ్యేయం.. రూరల్ సీఐ చిరంజీవి

ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే లక్ష్యంగా కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు, డీఎస్పీ ఏ. శ్రీనివాసులు పర్యవేక్షణలో మంగళవారం గుడికల్ గ్రామంలో పోలీసులు కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ నిర్వహించారు.రూరల్ సీఐ ఎస్. చిరంజీవి, ఎస్‌ఐలు కె. శ్రీనివాసులు, ఎం. తిమ్మారెడ్డి సహా సుమారు 30 మంది పోలీసు సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. గ్రామంలోని అనుమానితుల ఇళ్లను తనిఖీ చేయడంతో పాటు సరైన ధ్రువపత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 20 ద్విచక్ర వాహనాలను గుర్తించి పరిశీలించారు. ధ్రువపత్రాలు చూపించిన అనంతరం వాహనాలను యజమానులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.ఈ సందర్భంగా సీఐ చిరంజీవి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో అల్లర్లు, గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు, అసత్య ప్రచారాలకు పాల్పడవద్దని సూచించారు. మద్యం, గంజాయి, పేకాట, మట్కా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కోరారు.ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటుహక్కును వినియోగించుకునేలా పటిష్ఠ భద్రత కల్పిస్తామని తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించి ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని కోరారు.

A. R. శరత్ కుమార్ సూర్య ప్రతినిధి ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా