ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కీర్తి జావిద్ ప్రచారం
పలమనేరు మేజర న్యూస పలమనేర మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటుండగా, 34వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కీర్తి జావిద్ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను కలుస్తున్నారు. వార్డులోని ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటూ తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.ఈ సందర్భంగా వార్డులో రహదారుల దుస్థితి, కాలువల సమస్యలు, వీధి దీపాల ఏర్పాటు వంటి స్థానిక సమస్యలను ప్రస్తావించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తూ, వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని కీర్తి జావిద్ తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అందుబాటులో ఉంటానని పేర్కొంటూ ఓటర్ల ఆదరణ కోరారు. ఈ కార్యక్రమంలో విజయ్, అమ్ములు, కోటి తదితరులు పాల్గొని ప్రచారం నిర్వహించారు.
అనిల్ కుమార్ యాదవ్