నేడు తాండూరుకు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. బుయ్యని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత స్టడీ మెటీరియల్స్ పంపిణీ
తాండూరు, మేజర్ న్యూస్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నేడు తాండూరు పట్టణానికి రానున్నారు. స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత స్టడీ మెటీరియల్స్ పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు అండగా నిలవాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఉచిత కోచింగ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అభ్యర్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్స్‌ను ఉచితంగా పంపిణీ చేసేందుకు ఫౌండేషన్ శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో పాటు జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా తదితర ప్రముఖులు హాజరుకానున్నారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.