స్థానిక ఎన్నికలు-తుపానులపై సమీక్ష
అరకులోయ, అక్టోబర్ 26, మేజర్ న్యూస్:స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ,తుఫాను ప్రభావంలో తీసుకోవలసిన మందస్తు చర్యలపై స్థానిక ఎంపీడీవో వీసం.ప్రసాద్, స్థానిక తహసిల్దార్ జి.రాజా శ్రీధర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ టి.నిషాంతి,జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుమణిశ్రీ పూజ,పాడేరు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఆదిత్య వర్మ,పాడేరు సబ్ కలెక్టర్ కె.సాహిత్ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ శాఖ అధికారులు,సిబ్బందితో సమావేశమై ముందుగా తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు.స్థానిక మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో మండలంలోని బూత్ లెవల్ అధికారులు,పంచాయతీ కార్యదర్శులు,గ్రామ రెవెన్యూ అధికారులు, ఇతరత్రశాఖల సిబ్బందితో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రతి ఓటరుకు ఓటరు సమాచార స్లిప్పులు అందజేయడం,ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి అవసరమైన సౌకర్యాలు కల్పించడం,ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవడం వంటి అంశాలపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.అదేవిధంగా ఈ నెల27,28,29వ తేదీలలో తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అరకులోయ మండలంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి తుఫాను పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాదంశెట్టి.శ్రీధర్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది.