BREAKING
మా తమ్ముడికి అవకాశం ఇవ్వండి -మాధవ నగర్ లో అన్నా అనిత ప్రచారం ఫీజుల పేరుతో బీఈడీ ప్రవేశాలు నిరాకరించడమా...! నేటి రాశి ఫలాలు –27 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 27 అక్టోబర్ 2026 ఆర్నబ్ తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలి.. అగ్రిస్టాక్‌పై జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్.. రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి కృష్ణా జిల్లా సాధారణ పరిశీలకునిగా వి. అభిషేక్ నియామకం అవినీతి నిర్మూలనలో ప్రజలు భాగస్వాములు కావాలి ఎన్నికల తనిఖీల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు విద్యుత్ బకాయిల వసూళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలి మానవత్వాన్ని చాటుకున్న దామర ఎస్సై ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్ల పరిశీలన... - లయోలా కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ తనిఖీ నేడు ఆర్టీసీ డయల్ యువర్ డిఎం ఫొటో ఓటర్ స్లిప్పు తప్పనిసరి కాదు.. : కమిషనర్ ధ్యానచంద్ర స్పష్టీకరణ

యాసంగిలో లాభాదాయకమైన ఆరుతడి పంటలను సాగు చేయాలి

Select Suryaa Now
యాసంగిలో లాభాదాయకమైన ఆరుతడి పంటలను సాగు చేయాలి

 చిట్యాల, మేజర్ న్యూస్, యాసంగిలో వరి, మొక్కజొన్న బదులు లాభ దాయకమైన ఆరుతడి పంటలను సాగు చేయాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని జూకల్ రైతు వేదికలో వివిధ గ్రామానికి రైతులకు రికగ్నేషన్ ప్రీమియర్ లెర్నింగ్ పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ యాసంగిలో వరి, మొక్కజొన్న బదులు ఆరుతడి పంటలను సాగు చేయాలన్నారు.  రసాయనాలు లేని ప్రకృతి సేద్యం సహజ సిద్ధమైన సాగు పద్ధతులను పాటించాలన్నారు. సకాలంలో చీడ పీడల వ్యాప్తిని గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. సాంప్రదాయక పంటలను సాగు కంటే లాభదాయకమైన పంటలు సాగు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఏఈఓ లు చిర్ర సన్ని, రమణ కుమార్, దీపక్, సందీప్, మౌనిక వివిధ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.

రిపోర్టర్: సదానందం, చిట్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లా