జడ్పిటిసి పీఠం ఎవరికి?.
కాపు సమీకరణంతో అనకాపల్లిలో రాజకీయ వేడి.
యువ విద్యావేత్త, క్లీన్ ఇమేజ్ ఉన్న సాయి కిరణ్.
పల్లేల సాయి కిరణ్ తో వైసీపీ గెలుపు వ్యూహం.
అనకాపల్లి, అక్టోబర్ 26, మేజర్ న్యూస్: అనకాపల్లి మండల జడ్పిటిసి ఎన్నిక రసవత్తరంగా మారింది. అధికార కూటమి ప్రభుత్వం ఇప్పటికే కాపు సామాజిక వర్గానికి చెందిన కుంచంగి గ్రామానికి చెందిన వ్యక్తికి జడ్పిటిసి పదవిని కేటాయించారు. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ కూడా అదే వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఆ వ్యూహంలో భాగంగానే వైఎస్సార్‌సీపీ నుండి ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్న ఒకే ఒక్క పేరు పల్లేల వెంకట సీతమ్మ దొర అలియాస్ సాయి కిరణ్!
ఎందుకు సాయి కిరణ్ కే? - బలమైన కారణాలు:
వైఎస్సార్‌సీపీ అధిష్టానం కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని సాయి కిరణ్ ను రంగంలోకి దించేసింది. దీనికి తోడు ఆయనకు ఉన్న బలాలు ఈ దిగువిధంగా మనవి. రాజకీయ వారసత్వం: పల్లేల కుటుంబానికి మండలంలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. సాయి కిరణ్ పెద్దన్నాన్న శివ సత్యం కాంగ్రెస్, వైసీపీలో 30 ఏళ్లుగా క్రియాశీలక నేత. సత్యనారాయణ స్వామి దేవస్థానం చైర్మన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్, ఎంపీటీసీగా సేవలు. ఆ వారసత్వం సాయి కిరణ్ కు ప్లస్. యువతలో ఫాలోయింగ్: 2021 సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల విజయంలో కీలక పాత్ర పోషించి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ దృష్టిలో పడ్డారు. ప్రస్తుతం అనకాపల్లి జిల్లా వైసీపీ ఐటీ వింగ్ అధ్యక్షుడిగా, యువజన విభాగం అధ్యక్షుడిగా యువతలో బలమైన పట్టు ఉంది. సామాజిక సమీకరణం పరంగా చూస్తే మండలంలోని 32 పంచాయతీల్లో విస్తృత పరిచయాలు, ఉన్నత విద్యావంతుడు, కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన యువ నేత కావడం, అనకాపల్లి సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ కు నమ్మకమైన ముఖ్య అనుచరుడు కావడం సాయి కిరణ్ జడ్పిటిసి అభ్యర్థిగా ఎంపికయ్యారు.
అసలు సమీకరణం ఏంటంటే...
వైఎస్ఆర్ సీపీలో గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి పదవులను అధిరోహించినప్పటికీ మచ్చలేని మనిషిగా పల్లేల సాయికిరణ్ గుర్తించింది. వైసీపీ కాపు సామాజిక వర్గానికి చెందిన యువ విద్యావేత్త, క్లీన్ ఇమేజ్ ఉన్న సాయి కిరణ్ ను బరిలోకి దింపితే కాపు ఓట్లతో పాటు యూత్ ఓటును కూడా కొల్లగొట్టవచ్చని వ్యూహ రచన చేస్తోంది. మలసాల భరత్ కుమార్, బొడ్డేడ ప్రసాద్ ల ఆశీస్సులతో సాయి కిరణ్ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది.
ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువడడంతో వైఎస్సార్‌సీపీ వర్గాల్లో జడ్పిటిసి గెలుపుపై జోరుగా చర్చ సాగుతోంది. వ్యూహాత్మకంగా వ్యవహరించి గెలుపుని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు.