అభివృద్ధి పనులకు సిఎస్ఆర్ నిధులు కేటాయించండి
మల్హర్, మేజర్ న్యూస్, మల్హర్‌రావు మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామ అభివృద్ధి పనులకు ఏఎంఆర్, టీజీ జెన్‌కో సంస్థల ద్వారా సీఎస్‌ఆర్ నిధులు కేటాయించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ బండి స్వామి సోమవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో బాగంగా వినతిపత్రం అందజేశారు. గ్రామంలోని వీధుల్లో వీధి దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు, రైతులు పొలాలకు వెళ్లేందుకు అనువుగా వ్యవసాయ రహదారులను అభివృద్ధి చేయాలని కోరారు. అలాగే గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సంబంధిత సంస్థల సమన్వయంతో నిధులు మంజూరు చేసి, గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టాలని సర్పంచ్ బండి స్వామి కోరారు.
రిపోర్టర్; ప్రభాకర్, మలహర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా