BREAKING
మా తమ్ముడికి అవకాశం ఇవ్వండి -మాధవ నగర్ లో అన్నా అనిత ప్రచారం కూటమితోనే నగరాభివృద్ధి సాధ్యం... -అరుణోదయ నగర్ ప్రచారంలో అన్నా మల్లీశ్వరి ఫీజుల పేరుతో బీఈడీ ప్రవేశాలు నిరాకరించడమా...! నేటి రాశి ఫలాలు –27 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 27 అక్టోబర్ 2026 ఆర్నబ్ తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలి.. అగ్రిస్టాక్‌పై జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్.. రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి కృష్ణా జిల్లా సాధారణ పరిశీలకునిగా వి. అభిషేక్ నియామకం అవినీతి నిర్మూలనలో ప్రజలు భాగస్వాములు కావాలి ఎన్నికల తనిఖీల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు విద్యుత్ బకాయిల వసూళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలి మానవత్వాన్ని చాటుకున్న దామర ఎస్సై ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్ల పరిశీలన... - లయోలా కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ తనిఖీ నేడు ఆర్టీసీ డయల్ యువర్ డిఎం

గుడుంబా మహమ్మారి నిర్మూలనకు గ్రామస్తులు కృషి చేయాలి

Select Suryaa Now
గుడుంబా మహమ్మారి నిర్మూలనకు గ్రామస్తులు కృషి చేయాలి

తాడ్వాయి , మేజర్ న్యూస్, మారుమూల గిరిజన గ్రామాలలో గుడుంబా నిర్మూలనకు కృషి  చేయాలని లింగాల సర్పంచ్ మొగిలిపెళ్లి రవీందర్ సూచించారు. సోమవారం
లింగాల గ్రామపంచాయతీలో గుడుంబా మహమ్మారిని అంత మోదించాలని గ్రామంలోని యువతీ యువకులకు ప్రతిజ్ఞ చేయించారు.సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామంలో వీధుల వెంట ట్రాక్టర్ లో పర్యటించి  మహిళా సంఘాలు గ్రామ ప్రజలతో కలిసి గుడుంబా తయారీదారుల ఇండ్ల లో కి వెళ్లి గుడుంబా డ్రమ్ములను ,ప్లాస్టిక్ టిన్నులను ధ్వంసం చేసి బెల్లం పానకాన్ని పారబోసి తయారీదారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎల్ నీనో ప్రభావంతో ప్రజలు కరువు కాటకాలతో పంటలు పండక ఇబ్బంది పడుతున్నారు,దీనికి ప్రత్యామ్నంగా ఏమి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంటే ఈ ప్రాంతంలో ఈ గుడుంబా మహమ్మారిని విచ్చలవిడిగా తయారుచేసి  తమ జేబులు నింపుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. అంతే కాకుండా గుడుంబా తయారీ లో నాసిరకమైన వివిధ మత్తు పదార్థాలను కలుపుతూ యువకుల బంగారు భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ఆరోపించారు.  యువత ఈ మత్తు పదార్థాల వలన అనేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, కొందరు పేద ప్రజల బతుకులు దుర్భర పరిస్థితి నెలకొని వారి కుటుంబాలు బజారున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా రైతు భరోసా ఆసరా పింఛన్లు ప్రవేశపెట్టిన ఆ డబ్బులు గుడుంబా అమ్మే వారి వద్దకే వెళుతున్నాయని, ఈ సమస్య ఇలాగే కొనసాగితే ప్రజలు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవలసి వస్తుందన్నారు.ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ఆప్కారి శాఖ అంతంత మాత్రంగానే పనిచేస్తుందని పూర్తిస్థాయిలో పట్టించుకోవడం లేదన్నారు.  ఈ సమస్య పూర్తిగా అంతరించి పోవాలంటే మహిళా సంఘాలు వివిధ కుల సంఘాలు ప్రజలు ఒక్కటై ఈ సమస్యపై దండయాత్ర చేయవలసిన అవసరం ఉందని, గుడుంబా నిర్మూలనకు ప్రతి ఒక్కరు  కృషి చేయాలని కోరారు. గుడుంబా సమస్యను నిర్మూలించి అభివృద్ధి వైపు అడుగులు వేయాలని ప్రజలకు దిశా నిర్దేశం చేశారు. ఎవరైనా గుడుంబా తయారు చేసిన అమ్మిన వారికి ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు వర్తించవని అంతేకాకుండా వారిపై 50 వేల రూపాయల జరిమానా  విధించడం జరుగుతుందని గ్రామపంచాయతీలో తీర్మానం చేయడం జరిగిందన్నారు. గుడుంబా సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు పంచాయతీ కార్యదర్శి మోడం రాజేష్ ,వార్డు మెంబర్లు ,మహిళా సంఘాలు, యువతి,యువకులు స్థానిక ప్రజలు  తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్: సంపత్ ,తాడువాయి, ములుగు జిల్లా