BREAKING
మానవత్వాన్ని చాటుకున్న దామర ఎస్సై ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్ల పరిశీలన... - లయోలా కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ తనిఖీ నేడు ఆర్టీసీ డయల్ యువర్ డిఎం ఫొటో ఓటర్ స్లిప్పు తప్పనిసరి కాదు.. : కమిషనర్ ధ్యానచంద్ర స్పష్టీకరణ దామెర పోలీసుల ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ మ‌హ‌ర్షి వాల్మీకి జ‌యంతిన ఘ‌న నివాళి మహర్షి వాల్మీకి ఆశయాలు, ఆదర్శాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం -- డీసీఆర్‌బీ డీఎస్పీ ఏ. మహేష్ డిజిపి కార్యాలయంలో వాల్మీకి జయంతి వేడుకలు నిర్వహించిన : డిజి లా & ఆర్డర్ మహేష్ భగవత్ సెల్ఫోన్ సంకేతాలు లేక అవస్థలు! మల్కాజ్గిరి ని. వర్గ ఎమ్. ఎల్. ఏ.పై తప్పుడు ప్రచారం చేస్తున్నావారిపై ఛర్యల కోసం ఆల్వాల్ పి. ఎస్. లో బి. ఆర్. ఎస్. నేతల పిర్యాదు. అక్రమంగా మొరం తరలిస్తున్న టిప్పర్ పట్టివేత -- డ్రైవర్, యజమానిపై కేసు నమోదు -- టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు వెల్లడి సైబరాబాద్ లో 329 మందిపై డ్రంక్ & డ్రైవ్ కేసులు - ట్రాఫిక్ ఏడీసీపీ అడ్మిన్, జి. నరేెందర్ డిప్యూటేషన్ లేకుండానే వేతనం మచిలీపట్నం అభివృద్ధికి కూటమికి మద్దతివ్వండి.. : మంత్రి కొల్లు రవీంద్ర వినాయక్ నగర్ డివిజన్ లో సమస్యలను పరిష్కరించాలి *ప్రజావాణిలో..మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి ఫిర్యాదు

అర్నబ్’ తుపాను పై ముందస్తు భద్రతా చర్యలను ముమ్మరం చేసిన దక్షిణ కోస్తా రైల్వే..

Select Suryaa Now
అర్నబ్’ తుపాను పై ముందస్తు భద్రతా చర్యలను ముమ్మరం చేసిన దక్షిణ కోస్తా రైల్వే..

 భద్రతా చర్యలు, విపత్తు నిర్వహణ సన్నద్ధత, ప్రయాణికుల సహాయక ఏర్పాట్లను సమీక్షించిన జనరల్ మేనేజర్  సందీప్ మాథుర్..

దక్షిణ కోస్తా రైల్వే జోనల్ ప్రధాన కార్యాలయంలో 24 గంటలూ పనిచేసే ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు..


విశాఖపట్నం, మేజర్ న్యూస్ : ‘అర్నబ్’ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో, ప్రయాణికులు, రైల్వే సిబ్బంది భద్రతతో పాటు రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, విపత్తు నిర్వహణ సన్నద్ధతపై దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్  సందీప్ మాథుర్ సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దక్షిణ కోస్తా రైల్వే పరిధిలోని నాలుగు డివిజన్ల డివిజనల్ రైల్వే మేనేజర్లు , వివిధ విభాగాల ప్రధానాధికారులతో  సమీక్షా సమావేశం నిర్వహించి, అవసరమైన ఆదేశాలు జారీ చేశారు.
తుపాను ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు  తుపాను ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్న రైల్వే వంతెనలు, పట్టాలు, యార్డులు, సిగ్నలింగ్ వ్యవస్థలపై 24 గంటలూ ప్రత్యేక నిఘా, పర్యవేక్షణను ముమ్మరం చేశారు.
వర్షపు నీరు నిల్వ ఉండకుండా క్యాచ్ వాటర్ డ్రెయిన్లు, నీటి పారుదల కాలువల్లో పేరుకుపోయిన పూడిక, పిచ్చిమొక్కలు, చెత్తాచెదారాన్ని తొలగించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో పెట్రోలింగ్ సిబ్బందిని, వాచ్‌మెన్లను నియమించారు. అత్యవసర పరిస్థితుల్లో రైల్వే పట్టాల మరమ్మతులకు అవసరమైన సామగ్రిని తగినంత నిల్వ ఉంచారు. తుపాను పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సన్నిహిత సమన్వయం కొనసాగించాలని, భారత వాతావరణ శాఖ జారీ చేసే వాతావరణ హెచ్చరికలు, సూచనలను నిరంతరం పర్యవేక్షించాలని జనరల్ మేనేజర్ అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందన, సమర్థవంతమైన సమన్వయం కోసం దక్షిణ కోస్తా రైల్వే జోనల్ ప్రధాన కార్యాలయంతో పాటు డివిజనల్ ప్రధాన కార్యాలయాల్లో 24 గంటలూ పనిచేసే ప్రత్యేక వార్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు అవసరమైన సహాయం అందించడంతో పాటు వారి భద్రతను నిర్ధారించేందుకు ప్రత్యేక ఏర్పాట్లను మరింత పటిష్ఠం చేశారు.
ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు రైళ్ల రాకపోకలు, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని సకాలంలో అందించేందుకు ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. తుపాను కారణంగా ఏవైనా రైళ్లు రద్దయిన పక్షంలో, టికెట్ ఛార్జీల వాపసు ప్రక్రియను సులభతరం చేసేందుకు అదనపు కౌంటర్లను నిర్వహించనున్నారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, రైల్వే క్యాటరింగ్ యూనిట్లలో తగినంత ఆహార నిల్వలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పటికీ సేవలు కొనసాగించేందుకు ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చేశారు. వైద్య సేవలు సిద్ధం: అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్య సహాయం అందించేందుకు వైద్య బృందాలు, ప్రథమ చికిత్స సౌకర్యాలు, అంబులెన్స్‌లను 24 గంటలూ అందుబాటులో ఉండేలా సిద్ధంగా ఉంచారు. సివిల్ డిఫెన్స్ సిబ్బంది, స్కౌట్స్ అండ్ గైడ్స్ వాలంటీర్లను అప్రమత్తం చేశారు. అవసరమైతే ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైనప్పుడు తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు అత్యవసర స్పందన బృందాలను సిద్ధంగా ఉంచారు.

ప్రయాణికులకు దక్షిణ కోస్తా రైల్వే విజ్ఞప్తి....

తుపాను నేపథ్యంలో రైళ్ల రాకపోకలు, రైలు సేవల్లో మార్పులు, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని రైల్వే స్టేషన్లలోని సహాయ కేంద్రాలు, హెల్ప్‌లైన్ నంబర్లు, అధికారిక సమాచార మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేయనున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే పేర్కొంది. ప్రయాణికులు తమ ప్రయాణాలకు సంబంధించి రైల్వే అధికారిక సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని, రైళ్ల రాకపోకలకు సంబంధించిన తాజా వివరాలను తెలుసుకోవాలని, భద్రతా సూచనలను పాటిస్తూ రైల్వే అధికారులకు సహకరించాలని దక్షిణ కోస్తా రైల్వే విజ్ఞప్తి చేసింది.