BREAKING
అభివృద్ధి పనులకు సిఎస్ఆర్ నిధులు కేటాయించండి యాసంగిలో లాభాదాయకమైన ఆరుతడి పంటలను సాగు చేయాలి సత్యనిష్ఠతోనే నిజమైన సమృద్ధి: మాజీ డీజీపీ రవి గుప్తా ఎన్నికల నిబంధనల అమలుపై నిరంతర పర్యవేక్షణ.. మాజీ ఎమ్మెల్యే పరామర్శ.. ఉయ్యూరుకు కావాల్సింది మాటలు కాదు.. అభివృద్ధి పనులు : ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఎల్ ని నో పై కళాజాత వికసిత్ భారత్ సాధనలో ఎస్కీ పాత్ర కీలకం: కల్నల్ హర్పాల్ సింగ్ బుడమేరు ప్రవాహానికి ఆటంకాలు లేకుండా ముందస్తు చర్యలు : కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ కొండంత అండ.. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవన్న టీజీఎస్ ఆర్టీసీ ఈడీ సిహెచ్ వెంకన్న! ఎస్సైని మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్టిఐ హ్యూమన్ రైట్స్ జిల్లా కార్యదర్శి తెలంగాణ ఉద్యమ కారులు ముఖ్యమంత్రి ఇంటి ముట్టడికి వెళ్లిన ఉద్యమకారుల అరెస్ట్. ఎమ్మెల్సీ ఓటరు నమోదు స్పీడప్ చేయాలి: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నూతన గ్రామ యూత్ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు జలమండలిలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు

దూసుకు వస్తున్న ఆర్నాబ్ తుఫాన్.... నేడు, రేపు విద్యాసంస్థలకు సెలవులు ...

Select Suryaa Now
దూసుకు వస్తున్న  ఆర్నాబ్ తుఫాన్....  నేడు, రేపు  విద్యాసంస్థలకు సెలవులు ...

విశాఖపట్నం, మేజర్ న్యూస్ : ఆర్నాబ్ తుఫాను తీవ్రత మంగళవారం ఉదయం నుండి కోస్తాంధ్ర దిశగా అధికంగా ఉంటుందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. సాయంత్రానికి అతి తీవ్ర తుఫానుగా మారనుందని తెలిపారు. దీని ప్రభావంతో బలమైన పెనుగాలులు వీస్తాయని, శ్రీకాకుళం జిల్లా నుంచి బాపట్ల జిల్లా వరకు తీర ప్రాంతం తీవ్ర అలజడిగా ఉంటుందని తెలియజేశారు. కాకినాడ నుంచి యానం మధ్యలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తుందన్నారు.'అర్నాబ్' తుఫాను విశాఖపట్నానికి తూర్పు-ఆగ్నేయంగా సుమారు 600 కిలోమీటర్ల దూరంలో మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. గత ఆరు గంటలుగా ఇది పశ్చిమ-నైరుతి దిశగా కదులుతూ బలపడి తీవ్ర తుఫానుగా మారింది. ఈ తుఫాను పరిస్థితులు అనుకూలంగా ఉండటం వల్ల రాబోయే 12 నుండి 24 గంటల్లో అత్యంత వేగంగా బలపడి, రేపటికల్లా అతి తీవ్ర తుఫానుగా  మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. అక్టోబర్ 28 మధ్యాహ్నం కు  ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మీదుగా నరసాపురం - తుని మధ్య ఇది అతి తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉందన్నారు . తీరం దాటే సమయంలో గాలుల వేగం గంటకు 100 - 120 కిలోమీటర్ల వరకు ఉండవచ్చునని,  వాతావరణ శాఖ  తాజా హెచ్చరికల ప్రకారం  తీవ్రమైన గాలులు  గంటకు 115-125 కి.మీ, గరిష్టంగా 140 కి.మీ వేగంతో భయంకరమైన ఈదురు గాలులు వీస్తాయన్నారు.  భారీ వర్షాలు: అక్టోబర్ 27, 28 తేదీల్లో అత్యంత భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయన్నారు.  సముద్రపు అలలు 1.0 నుంచి 1.5 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడి తీర ప్రాంతాలను ముంచెత్తే ప్రమాదం ఉందన్నారు. మత్స్యకారులు  అక్టోబర్ 29 వరకు ఎవరూ బంగాళాఖాతంలోకి వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

కోస్తా,ఉత్తరాంధ్ర జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు.
 
 బంగాళాఖాతంలో ఏర్పడిన 'అర్నబ్' తుఫాన్ భయాల నేపథ్యంలో ఏపీలోని కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోని పాఠశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు.  
​అతి భారీ వర్షాల హెచ్చరికల వల్ల విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి,  అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, ఉభయ గోదావరి, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్  జిల్లాల్లో మంగళ, బుధవారం విద్యాసంస్థలు మూసివేస్తున్నట్లు తెలిపారు. జిల్లాల వారీగా కలెక్టర్లు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. పరిస్థితిని బట్టి మిగతా జిల్లాల్లోనూ సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.