BREAKING
కోనసీమ–కాకినాడ వైపు దూసుకొస్తున్న ‘ఆర్నబ్’.. ల్యాండ్‌ఫాల్‌కు ముందు కీలక గంటలు ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు ప‌టిష్ట భ‌ద్ర‌త‌ : జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ ఎన్నికల వ్యయ పర్యవేక్షణలో నిర్లక్ష్యానికి తావులేకుండా విధులు నిర్వహించాలి జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో అర్న‌బ్ కంట్రోల్ రూమ్‌లు చుట్టుముట్టిన అతి భారీ వర్షాలు ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా 166 పునరావాస కేంద్రాలు.. ఓట్ బచావో–దేశ్ బచావో ర్యాలీని విజయవంతం చేయండి వైసిపి ప్రచారంలో దూసుకుపోతున్న చైర్మన్ అభ్యర్థి శ్రీలక్ష్మి రాజేష్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి క్యాండిల్ ర్యాలీతో పోలీసు అమరవీరులకు ఘనమైన నివాళులు టిప్పర్ వాహనాల బ్యాటరీ దొంగ అరెస్ట్-ఆత్మకూరు సిఐ జి. బాబులాల్ పవర్‌పేట సినిమాలో పడమటవీధి జానకిగా రితికా నాయక్.. పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే లుక్ విడుదల ఆదర్శ కుటుంబం వేదికపై వెంకీ మామ రీల్ కొడుకు ఎమోషనల్ స్పీచ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా స్పై కామెడీ జోరు.. ఐదు రోజుల్లో పాతిక కోట్ల వసూళ్లు దాటిన ఉడ్తా తీర్ నా జీవితంలో ఎదుర్కొన్న కష్టాల్లో కేవలం పది శాతమే సినిమాలో చూపించారు.. బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ సంచలన వ్యాఖ్యలు

బస్సు నుంచి జారిపడి నర్సింగ్ విద్యార్థినికి గాయాలు

Select Suryaa Now
బస్సు నుంచి జారిపడి నర్సింగ్ విద్యార్థినికి గాయాలు


కోటబొమ్మాళి, అక్టోబరు 26, మేజర్ న్యూస్:
ఓ వైపు అధిక రద్దీ, మరోవైపు డ్రైవర్ అజాగ్రత్త ఒక విద్యార్థిని ప్రాణాల మీదకు తెచ్చిపెట్టింది. రద్దీగా ఉన్న ప్రైవేటు బస్సు నుంచి జారిపడి నర్సింగ్ విద్యార్థిని గాయపడిన ఘటన  మండలంలోని కొత్తపేటలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. ​స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... సంతబొమ్మాళి మండలం శివరాంపురం గ్రామానికి చెందిన ఐ.లలిత అనే విద్యార్థిని శ్రీకాకుళంలోని రాగోలు ‘జేమ్స్’ వైద్యకళాశాలలో నర్సింగ్ చదువుతోంది. దసరా సెలవుల నిమిత్తం సొంతూరు వచ్చిన లలిత, సెలవులు ముగియడంతో తిరిగి కళాశాలకు వెళ్లేందుకు సోమవారం ఉదయం ప్రయాణమైంది. ​సాకిపల్లి కొత్తూరు జంక్షన్ వద్ద ప్రయాణికులతో కిక్కిరిసి ఉన్న ఓ ప్రైవేటు బస్సు ఎక్కింది. బస్సులో తీవ్ర రద్దీ ఉండటంతో ఆమె తలుపు వద్ద నిలబడాల్సి వచ్చింది.
​బస్సు కోటబొమ్మాళి మండలం జాతీయ రహదారిపై ఉన్న కొత్తపేట బి.ఎన్.ఎమ్ పెట్రోల్ బంకు సమీపానికి చేరుకునేసరికి, డ్రైవర్ ఒక్కసారిగా జాతీయ రహదారి నుంచి సర్వీస్ రోడ్డు వైపు వేగంగా బస్సును తిప్పడంతో, తలుపు వద్దే నిలబడి ఉన్న లలిత పట్టుతప్పి బస్సులోంచి బయటకు కిందకు పడిపోవడంతో ఆమెకు గాయాలయ్యాయి.
​ప్రమాదాన్ని గమనించిన స్థానికులు తక్షణమే స్పందించి గాయపడిన లలితను కోటబొమ్మాళి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం కుటుంబసభ్యులు ఆమెను శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ​ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న కోటబొమ్మాళి ఎస్ఐ వి సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.
​ప్రజా రవాణా మరియు ప్రైవేటు బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, డ్రైవర్ల నిర్లక్ష్యంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.