BREAKING
కోనసీమ–కాకినాడ వైపు దూసుకొస్తున్న ‘ఆర్నబ్’.. ల్యాండ్‌ఫాల్‌కు ముందు కీలక గంటలు ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు ప‌టిష్ట భ‌ద్ర‌త‌ : జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ ఎన్నికల వ్యయ పర్యవేక్షణలో నిర్లక్ష్యానికి తావులేకుండా విధులు నిర్వహించాలి జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో అర్న‌బ్ కంట్రోల్ రూమ్‌లు చుట్టుముట్టిన అతి భారీ వర్షాలు ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా 166 పునరావాస కేంద్రాలు.. ఓట్ బచావో–దేశ్ బచావో ర్యాలీని విజయవంతం చేయండి వైసిపి ప్రచారంలో దూసుకుపోతున్న చైర్మన్ అభ్యర్థి శ్రీలక్ష్మి రాజేష్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి క్యాండిల్ ర్యాలీతో పోలీసు అమరవీరులకు ఘనమైన నివాళులు టిప్పర్ వాహనాల బ్యాటరీ దొంగ అరెస్ట్-ఆత్మకూరు సిఐ జి. బాబులాల్ పవర్‌పేట సినిమాలో పడమటవీధి జానకిగా రితికా నాయక్.. పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే లుక్ విడుదల ఆదర్శ కుటుంబం వేదికపై వెంకీ మామ రీల్ కొడుకు ఎమోషనల్ స్పీచ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా స్పై కామెడీ జోరు.. ఐదు రోజుల్లో పాతిక కోట్ల వసూళ్లు దాటిన ఉడ్తా తీర్ నా జీవితంలో ఎదుర్కొన్న కష్టాల్లో కేవలం పది శాతమే సినిమాలో చూపించారు.. బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ సంచలన వ్యాఖ్యలు

కొత్తపేటలో పోలీసుల కార్డెన్ సెర్చ్

Select Suryaa Now
కొత్తపేటలో పోలీసుల కార్డెన్ సెర్చ్

- సరైన పత్రాలు లేని 11 ద్విచక్రవాహనాలు సీజ్ కోటబొమ్మాళి, అక్టోబరు 26, మేజర్ న్యూస్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతిభద్రత పరిరక్షణ మరియు నేరాల నియంత్రణే ధ్యేయంగా మండలంలో గల కొత్తపేట తారకరామ కాలనీలో సోమవారం స్థానిక ఎస్ఐ వంగపండు సత్యన్నారాయణ తన సిబ్బందిలో కలిసి కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. దీనిలో భాగంగా సరైన ధ్రువీకరణ పత్రాలు (ఆర్సీ, లైసెన్స్ మొదలైనవి) లేని 11 ద్విచక్ర వాహనాలను మరియు అనుమానాస్పద వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే పాత నేరస్థులు, రౌడీషీటర్లు మరియు అనుమానాస్పదంగా కనిపిస్తున్న కొత్త వ్యక్తుల వివరాలను పోలీసులు క్షుణ్ణంగా ఆరా తీశారు. ​ఈ సందర్భంగా ఎస్ఐ వి. సత్యనారాయణ మాట్లాడుతూ ఇళ్లను అద్దెకు ఇచ్చే ముందు వారి పూర్తి పూర్వాపరాలు తెలుసుకోవాలని, అపరిచిత లేదా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఎన్నికల వేళ ఉచితాలు, చట్టవిరుద్ధంగా మద్యం సీసాలు నిల్వ చేయడం లేదా పెద్ద మొత్తంలో రికార్డులు లేని నగదు రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్నికల నిబంధనలు (కోడ్) ప్రతీ ఒక్కరూ పాటించాలని, శాంతియుత వాతావరణానికి సహకరించాలని కోరారు.​ఈ తనిఖీలో స్థానిక పోలీస్ సిబ్బంది, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.