BREAKING
శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలి ఓటీటీలో మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ థ్రిల్లర్: నిత్యా మీనన్, అభిషేక్ బచ్చన్ సిరీస్‌కు విపరీతమైన క్రేజ్ ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు శిక్షణ! చంద్రగిరి నియోజక వర్గంలో 142 మంది వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామి నేషన్లు తిరస్కరణ -ఒక న్యాయవాదిగా అభ్యర్థుల తరపున వెళ్లిన చెవిరెడ్డి పినపళ్లలో టీడీపీ జోరు... వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి చేరికలు... 7, 8, 9 వార్డుల్లో టీడీపీ, జనసేన అభ్యర్థుల ప్రచారం పశు వైద్యశాల నూతన భవనానికి రూ.30 లక్షల అంచనాలు సిద్ధం. ​ఆర్ఐఎన్ఎల్‌లో ఘనంగా విజిలెన్స్ వారోత్సవాలు ​ఉద్యోగుల చేత 'సమగ్రతా ప్రతిజ్ఞ' ఇన్ఫోసిస్‌ ప్రారంభోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.. కలెక్టర్‌ మను చౌదరి ఆదేశం స్ట్రోక్ పై చిన్నారులతో కేర్ హాస్పిటల్స్ వినూత్న కార్యక్రమం - పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు పట్టణంలో కొత్తపల్లి ఇంటింటి ప్రచారం మీ ఇంటి ఆడబిడ్డ గా పింకీ జైన్ ను ఆదరించి గెలిపించండి.... మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ ఇంటింటా ప్రచారం ఆర్.సి.యం చర్చి వార్షికోత్సవ శుభాకాంక్షలు - ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆర్నాబ్ తుఫాను నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి - మండల వ్యవసాయ అధికారి జి. వాణి. భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండాలి

మాచవరం గ్యాస్ లీకేజీపై ప్రజలు ఆందోళన చెందవద్దు - జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్

Select Suryaa Now
మాచవరం గ్యాస్ లీకేజీపై ప్రజలు ఆందోళన చెందవద్దు - జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్

అంబాజీపేట మేజర్ న్యూస్  :అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మాచవరం గ్రామంలో చోటుచేసుకున్న గ్యాస్ లీకేజీ ఘటనపై జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ సోమవారం స్పందించి అదికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.మాచవరం గ్రామం కళ్ల తూము దగ్గర భారత్ గ్యాస్ సిలిండర్ కంపెనీ సమీపంలో ఓఎన్జీసీ క్రూడ్ ఆయిల్ ప్రధాన పైప్ లైన్ లీక్ అయినట్లు అధికారులు గుర్తించారు. ఈ పైప్ లైన్ మామిడికుదురు ఓఎన్జీసీ నుండి పి.గన్నవరం మీదుగా మాచవరం, ముక్కామల - మడుపల్లి మీదుగా కాకినాడ వరకు వెళుతుందని తెలిపారు.లీకేజీ సమాచారం అందిన వెంటనే ఓఎన్జీసీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని లీకేజీని పూర్తిగా అదుపులోకి తీసుకున్నారని, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా కొత్తపేట ఆర్డీఓ జి.వి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ.. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం వెంటనే అప్రమత్తమైందన్నారు. సంఘటనా స్థలంలో చేరుకుని  అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ, సంబంధిత శాఖల అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఎలాంటి అపాయం జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఫైర్ ఇంజన్లను అందుబాటులో ఉంచామన్నారు.ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రమాద తీవ్రత తక్కువగానే ఉందని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, అధికారుల సూచనలు పాటిస్తూ సహకరించాలని కలెక్టర్ తరపున ఆర్డీఓ విజ్ఞప్తి చేశారు. అంబాజీపేట ఎంఆర్ఓ బి. చినబాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఓఎన్జీసీ అధికారులతో మాట్లాడి పలు జాగ్రత్తలు, సూచనలు చేశారు.