BREAKING
కోనసీమ–కాకినాడ వైపు దూసుకొస్తున్న ‘ఆర్నబ్’.. ల్యాండ్‌ఫాల్‌కు ముందు కీలక గంటలు ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు ప‌టిష్ట భ‌ద్ర‌త‌ : జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ ఎన్నికల వ్యయ పర్యవేక్షణలో నిర్లక్ష్యానికి తావులేకుండా విధులు నిర్వహించాలి జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో అర్న‌బ్ కంట్రోల్ రూమ్‌లు చుట్టుముట్టిన అతి భారీ వర్షాలు ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా 166 పునరావాస కేంద్రాలు.. ఓట్ బచావో–దేశ్ బచావో ర్యాలీని విజయవంతం చేయండి వైసిపి ప్రచారంలో దూసుకుపోతున్న చైర్మన్ అభ్యర్థి శ్రీలక్ష్మి రాజేష్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి క్యాండిల్ ర్యాలీతో పోలీసు అమరవీరులకు ఘనమైన నివాళులు టిప్పర్ వాహనాల బ్యాటరీ దొంగ అరెస్ట్-ఆత్మకూరు సిఐ జి. బాబులాల్ పవర్‌పేట సినిమాలో పడమటవీధి జానకిగా రితికా నాయక్.. పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే లుక్ విడుదల ఆదర్శ కుటుంబం వేదికపై వెంకీ మామ రీల్ కొడుకు ఎమోషనల్ స్పీచ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా స్పై కామెడీ జోరు.. ఐదు రోజుల్లో పాతిక కోట్ల వసూళ్లు దాటిన ఉడ్తా తీర్ నా జీవితంలో ఎదుర్కొన్న కష్టాల్లో కేవలం పది శాతమే సినిమాలో చూపించారు.. బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ సంచలన వ్యాఖ్యలు

ఆర్నాబ్ తుఫాను నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి - మండల వ్యవసాయ అధికారి జి. వాణి.

Select Suryaa Now
ఆర్నాబ్ తుఫాను నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి - మండల వ్యవసాయ అధికారి జి. వాణి.

బిక్కవోలు మేజర్ న్యూస్. ఆర్నాబ్ తుఫాను ప్రభావంతో ఈ నెల 27, 28, 29, 30 తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో బిక్కవోలు మండలంలోని వరి సాగు రైతులు అప్రమత్తంగా ఉండాలని మండల వ్యవసాయ అధికారి జి. వాణి సూచించారు. తుఫాను ప్రభావం వల్ల పంట నష్టపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె రైతులకు విజ్ఞప్తి చేశారు.
కోతకు సిద్ధంగా ఉన్న వరి పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా మురుగునీటి కాలువలు, బోదెలను శుభ్రపరిచి, పొలాల్లోని నీటిని పూర్తిగా బయటకు వెళ్లేలా చర్యలు చేపట్టాలని సూచించారు. వర్షపు నీరు సులభంగా బయటకు వెళ్లేందుకు అవసరమైన మార్గాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
తుఫాను ప్రభావం ఉండే నాలుగు రోజుల పాటు, అంటే ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు వరి కోతలను వాయిదా వేసుకోవాలని సూచించారు. ఇప్పటికే కోతలు కోసిన రైతులు ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, పొలాల్లోని నీరు నిలిచే ప్రాంతాల్లో ధాన్యాన్ని నిల్వ ఉంచరాదని స్పష్టం చేశారు.
దాళ్వా సాగు కోసం విత్తన ధాన్యంగా ఉపయోగించేందుకు ఉంచిన ధాన్యాన్ని తేమ తగలకుండా సురక్షిత ప్రదేశంలో భద్రపరచుకోవాలని తెలిపారు. తుఫాను ప్రభావం ఉన్న సమయంలో నాలుగు రోజుల పాటు పురుగుమందుల పిచికారీకి దూరంగా ఉండాలని సూచించారు.
తుఫాను ప్రభావం తగ్గిన అనంతరం పొలాల్లో నిలిచిన నీటిని బయటకు తొలగించి, పంట పరిస్థితిని పరిశీలించిన తర్వాత వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలని మండల వ్యవసాయ అధికారి జి. వాణి రైతులకు విజ్ఞప్తి చేశారు.