BREAKING
ఎన్నికలు ప్రశాంతం గా నిర్వహించేందుకు సహకరించండి ఎస్ఎస్ఓ బృందం పనితీరుపై తహసీల్దార్ పర్యవేక్షణ ఆపరేషన్ ధియేటర్ లను ప్రారంభించిన డా. చిరంజీవి ప్రశాంత వాతావరణం లో ఎన్నికలు జరిగేలా చూడాలి నీటిని కాపాడండి – ప్రతి నీటి బొట్టు అమూల్యమైనది కూకట్‌పల్లి జోన్‌లో జల సంరక్షణపై అవగాహన ర్యాలీ సంతోషపురం ఎంపీటీసీ డమ్మీ అభ్యర్ధి నామినేషన్ ఉపసంహరణ స్థానిక సంస్థల ఎన్నికలకు అవసరమైన సామాగ్రి సిద్దం ఉధ్యాన కళాశాలలో ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలు పరిశీలన చిన్నపిల్లల్లో ఊబకాయానికి జన్యుపరమైన కారణాలు కూడా దోహదం చేస్తాయా? గత ఐదేళ్ల పాలనలో పట్టణం అధ్వాన్నం.. సీతానగరం మండలంలో ప్రభుత్వ భూముల పరిశీలన ఓటర్ల సవరణ ఆర్డర్లపై సుప్రీంకోర్టులో కేంద్ర ఎన్నికల సంఘం కౌంటర్ మెగాస్టార్ సంక్రాంతి రేసులో కన్ఫ్యూజన్: 'కాకా'నా లేక 'విశ్వంభర'నా? బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సరికొత్త చరిత్ర: 400 కోట్ల మైలురాయిని దాటిన కలెక్షన్లు అర్నబ్’ తుపాను పై ముందస్తు భద్రతా చర్యలను ముమ్మరం చేసిన దక్షిణ కోస్తా రైల్వే..

భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండాలి

Select Suryaa Now
భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండాలి

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంభారీ నుంచి అతి భారీ వర్షాలు, తుపాను ప్రభావం నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ హెచ్చరికల నేపథ్యంలో సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించిన అత్యవసర వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో కంట్రోల్ రూమ్‌లను అప్రమత్తంగా ఉంచాలని, వర్షాలు, వరదల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. విద్యుత్, తాగునీరు, వైద్య సేవలకు అంతరాయం కలగకుండా సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

రెండు రోజులు స్థానిక సెలవు

భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అక్టోబర్ 27, 28 తేదీల్లో జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు స్థానిక సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ఆదేశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని, విద్యార్థులు, తల్లిదండ్రులకు సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటిస్తూనే ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

అత్యవసర కంట్రోల్ రూమ్ నంబర్లు:

జిల్లా కలెక్టరేట్, రాజమహేంద్రవరం: 08832-944455

సబ్‌ కలెక్టర్ కార్యాలయం, రాజమహేంద్రవరం: 08832-442344

ఆర్డీవో కార్యాలయం, కొవ్వూరు: 08813-231488

భారీ వర్షాలు, వరదలు లేదా ఇతర అత్యవసర పరిస్థితులు ఎదురైతే ప్రజలు కంట్రోల్ రూమ్‌లకు సమాచారం అందించాలని కలెక్టర్ కోరారు. అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు.