ఉధ్యాన కళాశాలలో ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలు పరిశీలన
పరిశీలించిన జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి
కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత,స్ట్రాంగ్ రూమ్‌లపై నిరంతర నిఘా
సీసీటీవీ పర్యవేక్షణ పటిష్టంగా ఉండాలని అధికారులకు ఆదేశం
గరుగుబిల్లి, అక్టోబర్ 26, మేజర్ న్యూస్:స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల అనంతరం బాలెట్ బాక్సులు, భద్రత, ఎన్నికల ఫలితాల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వ హించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించా రు.గరుగుబిల్లి మండలం, ఉల్లిభద్ర సమీపంలోని ఉద్యానవన కళాశాలలో ఏర్పాటు చేసిన గరుగుబిల్లి, కొమరాడ, కురుపాం,గుమ్మలక్ష్మిపురo, జియ్య మ్మవలస మండలాలకు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలు, బాలెట్ బాక్స్ లను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌ల ను జిల్లా ఎస్పీ క్షేత్రస్థాయిలో పరిశీలిం చారు.కౌంటింగ్ కేంద్రాల ప్రాంగణం, స్ట్రాంగ్ రూమ్‌ల భద్రత, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, పోలీసు బందోబస్తు ఏర్పాట్లు, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధి కారులకు సూచనలు, మార్గదర్శకాలు జారీ చేస్తూ అధికారులకు దిశ నిర్దేశం చేశారు.స్ట్రాంగ్ రూమ్‌లకు నిర్దేశించిన భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని,అనధికార వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి ప్రవేశించ కుండా కట్టుదిట్టమైన నియంత్రణ ఏర్పాటు చేయాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో నిరంతర పోలీసు నిఘా కొనసాగించాలని, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రతి కదలికను నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తు.చ. తప్పకుండా పాటించాలన్నారు. అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు బందోబస్తు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.
ఈపరిశీలన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పాలకొండ డిఎస్పీ రాంబాబు, చిన మేరంగి సిఐ తిరుపతిరావు,మండల తహసిల్దార్ పాము బాల,ఎంపీడీవో నడిమింటి సూర్యనారాయణ, ఎస్ ఐ షేక్ ఫక్రుద్దీన్, ఏవో నాలి అర్జునరావు తదితరులు పాల్గొన్నారు.