BREAKING
స్ట్రోక్ పై చిన్నారులతో కేర్ హాస్పిటల్స్ వినూత్న కార్యక్రమం - పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు పట్టణంలో కొత్తపల్లి ఇంటింటి ప్రచారం మీ ఇంటి ఆడబిడ్డ గా పింకీ జైన్ ను ఆదరించి గెలిపించండి.... మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ ఇంటింటా ప్రచారం ఆర్.సి.యం చర్చి వార్షికోత్సవ శుభాకాంక్షలు - ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆర్నాబ్ తుఫాను నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి - మండల వ్యవసాయ అధికారి జి. వాణి. భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండాలి స్థానిక ఎన్నికల ప్రచారంలో నల్లమిల్లి మనోజ్ రెడ్డి. పలు చోట్ల టీడీపీ అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం. వాల్మీకి విజ్ఞాన కేంద్రంలో ఆదికవి వాల్మీకి జయంతి ఒక్క అవకాశం ఇవ్వండి...అభివృద్ధి చేసి చూపిస్తాం .... 13 వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి రుక్మిణమ్మను గెలిపించండి.. శాప్ ఛైర్మెన్ రవి నాయుడు ఎంపీటీసీ ఎన్నికల సిబ్బందికి శిక్షణ శాంతియుత ఎన్నికల నిర్వహణకు అందరూ సహకరించాలి - డీఎస్పీ విద్య. ఆగిరిపల్లిలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేత గ్రామాల అభివృద్ధికి సహకరిస్తా: మాజీ ఎమ్మెల్యే ఎం.వి. ప్రతాప్ అప్పారావు 12 నామినేషన్లు ఉపసంహరణ వేకువజామునే ప్రజల్లోకి నల్లా శ్రీధర్.. వాకర్స్‌తో ముఖాముఖి.. ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం క్యాంప‌స్‌లో పారిశుధ్య నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు

ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి

Select Suryaa Now
ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్:ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిబంధనల ప్రకారం వెంటనే పరిష్కరించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన అర్జీదారుల నుండి నేరుగా వినతులను స్వీకరించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ,.. రెవెన్యూ, పంచాయతీ రాజ్, సివిల్ సప్లైస్, మున్సిపల్ తదితర శాఖలకు సంబంధించి మొత్తం 133 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధితుల సమస్యలకు ప్రాధాన్యతనిచ్చి వేగంగా పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు. స్వీకరించిన దరఖాస్తులపై తీసుకున్న చర్యల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి మాలతి, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.