BREAKING
ఓటర్ల సవరణ ఆర్డర్లపై సుప్రీంకోర్టులో కేంద్ర ఎన్నికల సంఘం కౌంటర్ మెగాస్టార్ సంక్రాంతి రేసులో కన్ఫ్యూజన్: 'కాకా'నా లేక 'విశ్వంభర'నా? బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సరికొత్త చరిత్ర: 400 కోట్ల మైలురాయిని దాటిన కలెక్షన్లు అర్నబ్’ తుపాను పై ముందస్తు భద్రతా చర్యలను ముమ్మరం చేసిన దక్షిణ కోస్తా రైల్వే.. గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి చేపల నాగమణి ఎన్నికల ప్రచారం! ఎన్నికల నియమావళి, అర్ణబ్ తుఫాన్ పై గ్రామాల్లో అవగాహన. కన్స్యూమర్ డిమాండ్ స్ట్రాంగ్.. మార్జిన్లపై ముడిసరుకుల సెగ! జడ్పిటిసి పీఠం ఎవరికి?. బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా 'ఉడ్తా తిర్' జోరు మందగమనం: మొదటి సోమవారం భారీగా పడిపోయిన కలెక్షన్లు ఆటో మార్జిన్లు అప్: వాల్యూమ్స్, ప్రీమియమైజేషన్‌తో పుంజుకోనున్న రంగం! మూడు దశాబ్దాల తర్వాత థియేటర్లలోకి అక్షయ్ కుమార్ 'మొహ్రా': 4కే వర్షన్‌లో రీ-రిలీజ్ ఎన్నికల ఏర్పాట్లపై సబ్ కలెక్టర్ కీలక సూచనలు దూసుకు వస్తున్న ఆర్నాబ్ తుఫాన్.... నేడు, రేపు విద్యాసంస్థలకు సెలవులు ... స్థానిక ఎన్నికలు-తుపానులపై సమీక్ష భారత్‌తో టీ20 సిరీస్ పరాజయంపై కివీస్ కోచ్ సంచలన వ్యాఖ్యలు: కీలక సమయాల్లోనే చేజార్చుకున్నాం

ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం క్యాంప‌స్‌లో పారిశుధ్య నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు

Select Suryaa Now
ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం క్యాంప‌స్‌లో పారిశుధ్య నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు

* కూడ‌ళ్ల వ‌ద్ద వ్య‌ర్ధాల‌ను స‌త్వ‌రం తొల‌గించాలి
* హాస్టల్‌, మెస్ పరిస‌రాలు ప‌రిశుభ్రంగా ఉండాలి

విశాఖ ఎడ్యుకేషన్, మేజర్ న్యూస్ : ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం క్యాంప‌స్‌లో పారిశుధ్య నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజ‌శేఖ‌ర్ అదేశించారు. సోమ‌వారం ఆయ‌న ఆక‌స్మికంగా క్యాంప‌స్‌లోని ప‌లు ప్రాంతాలు ప‌రిశీలించారు. రోడ్డుప‌క్క‌నే వ్య‌ర్ధాలు గుట్ట‌లుగా ద‌ర్శ‌న‌మివ్వ‌డం,మైదానాలు,ఖాళీ ప్రాంతాలలో చెత్త‌,వ్య‌ర్దాలు పోయ‌డం ఆయ‌న దృష్టికి వ‌చ్చింది. ప్ర‌తీ హాస్టల్‌,మెస్‌ల నుంచి వ‌చ్చే వ్య‌ర్ధాల‌ను ఒక క్ర‌మ ప‌ద్ద‌తిలో నిర్వ‌హ‌ణ జ‌ర‌పాల‌ని సూచించారు. గ‌తంలో వ‌ర్సిటీలో ప్ర‌ధాన కూడ‌ళ్ల వ‌ద్ద ఏర్పాటు చేసిన డ‌స్ట్ బిన్‌ల‌లో వ్య‌ర్ధాల‌ను వేయ‌డం, వాటిని రోజు త‌ర‌లించ‌డం త‌ప్ప‌నిస‌రిగా జ‌ర‌గాల‌న్నారు. రోడ్డు ప‌క్క‌న వ్య‌ర్ధాలు వేయ‌డం, వాటిని మంట పెట్ట‌డం వంటివి చేయ‌కూడ‌ద‌న్నారు. పారిశుధ్య నిర్వ‌హ‌ణ‌లో ప‌నుల‌ను విభ‌జించి ప్ర‌ణాళికాయుతంగా నిర్వ‌హ‌ణ జ‌ర‌గాల‌ని సూచించారు. క్యాంప‌స్ ప‌రిశుభ్రంగా క‌నిపించే విధంగా వ‌ర్సిటీ వ్యాప్తంగా పూర్తిస్థాయిలో వ్య‌ర్ధాల తొల‌గింపుకు ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. పారిశుధ్య నిర్వ‌హ‌ణ విధుల‌లో అల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించే వారిపై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పారు. హాస్ట‌ల్ ప‌రిస‌రాలు,భ‌వ‌నాల చుట్టూ ఉన్న ప్రాంతాలు,ఖాళీ మైదానాలు ఎప్పుడూ ప‌రిశుభ్రంగా,ఆహ్లాద‌క‌రంగా నిల‌వాల‌న్నారు. గ‌తంలో ప‌లుమార్లు దీనిపై సిబ్బందికి సూచించ‌డం జ‌రిగింద‌ని అయిన‌ప్ప‌టికి మార్పు రాక‌పోవ‌డంతో సిబ్బంది విధుల ప‌ట్ల నిర్ల‌క్ష్యంగా వ్య‌హ‌రిస్తున్న‌ట్లు స్ప‌ష్టం అవుతోంద‌న్నారు. ఇటువంటి ప‌రిస్థితులు పున‌రావృతం అయితే సంబంధిత సిబ్బందిపై క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌కు ఆదేశించారు. వీసీ వెంట రెక్టార్ ఆచార్య పులిపాటి కింగ్‌,రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు,డీన్‌-ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ఆచార్య కె.శ్రీ‌నివాస రావు త‌దిత‌రులు ఉన్నారు.