BREAKING
ప్రశాంత వాతావరణం లో ఎన్నికలు జరిగేలా చూడాలి నీటిని కాపాడండి – ప్రతి నీటి బొట్టు అమూల్యమైనది కూకట్‌పల్లి జోన్‌లో జల సంరక్షణపై అవగాహన ర్యాలీ సంతోషపురం ఎంపీటీసీ డమ్మీ అభ్యర్ధి నామినేషన్ ఉపసంహరణ స్థానిక సంస్థల ఎన్నికలకు అవసరమైన సామాగ్రి సిద్దం ఉధ్యాన కళాశాలలో ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలు పరిశీలన చిన్నపిల్లల్లో ఊబకాయానికి జన్యుపరమైన కారణాలు కూడా దోహదం చేస్తాయా? గత ఐదేళ్ల పాలనలో పట్టణం అధ్వాన్నం.. సీతానగరం మండలంలో ప్రభుత్వ భూముల పరిశీలన ఓటర్ల సవరణ ఆర్డర్లపై సుప్రీంకోర్టులో కేంద్ర ఎన్నికల సంఘం కౌంటర్ మెగాస్టార్ సంక్రాంతి రేసులో కన్ఫ్యూజన్: 'కాకా'నా లేక 'విశ్వంభర'నా? బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సరికొత్త చరిత్ర: 400 కోట్ల మైలురాయిని దాటిన కలెక్షన్లు అర్నబ్’ తుపాను పై ముందస్తు భద్రతా చర్యలను ముమ్మరం చేసిన దక్షిణ కోస్తా రైల్వే.. గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి చేపల నాగమణి ఎన్నికల ప్రచారం! ఎన్నికల నియమావళి, అర్ణబ్ తుఫాన్ పై గ్రామాల్లో అవగాహన. కన్స్యూమర్ డిమాండ్ స్ట్రాంగ్.. మార్జిన్లపై ముడిసరుకుల సెగ!

ఆగిరిపల్లిలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేత గ్రామాల అభివృద్ధికి సహకరిస్తా: మాజీ ఎమ్మెల్యే ఎం.వి. ప్రతాప్ అప్పారావు

Select Suryaa Now
ఆగిరిపల్లిలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేత  గ్రామాల అభివృద్ధికి సహకరిస్తా: మాజీ ఎమ్మెల్యే ఎం.వి. ప్రతాప్ అప్పారావు

ఆగిరిపల్లి, మేజర్ న్యూస్: ఆగిరిపల్లి మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 18 మంది ఎంపీటీసీ అభ్యర్థులకు నూజివీడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు  ఎం.వి. ప్రతాప్ అప్పారావు పార్టీ బీ-ఫారాలను అందజేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులందరూ అధిక మెజార్టీతో విజయం సాధించి, ఆగిరిపల్లి మండల ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా కృషి చేయాలని ఆయన సూచించారు.

మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి ప్రజలు తమ ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే ఎం.వి. ప్రతాప్ అప్పారావు అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మరో రెండేళ్లే కొనసాగుతుందని, 2029లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పార్టీ అభ్యర్థులు ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికై మూడు సంవత్సరాల పాటు ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుందని పేర్కొంటూ, ప్రతి గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని అభ్యర్థులకు భరోసా ఇచ్చారు.

మండలంలోని అన్ని స్థానాల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.