BREAKING
ఉధ్యాన కళాశాలలో ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలు పరిశీలన చిన్నపిల్లల్లో ఊబకాయానికి జన్యుపరమైన కారణాలు కూడా దోహదం చేస్తాయా? గత ఐదేళ్ల పాలనలో పట్టణం అధ్వాన్నం.. సీతానగరం మండలంలో ప్రభుత్వ భూముల పరిశీలన ఓటర్ల సవరణ ఆర్డర్లపై సుప్రీంకోర్టులో కేంద్ర ఎన్నికల సంఘం కౌంటర్ మెగాస్టార్ సంక్రాంతి రేసులో కన్ఫ్యూజన్: 'కాకా'నా లేక 'విశ్వంభర'నా? బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సరికొత్త చరిత్ర: 400 కోట్ల మైలురాయిని దాటిన కలెక్షన్లు అర్నబ్’ తుపాను పై ముందస్తు భద్రతా చర్యలను ముమ్మరం చేసిన దక్షిణ కోస్తా రైల్వే.. గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి చేపల నాగమణి ఎన్నికల ప్రచారం! ఎన్నికల నియమావళి, అర్ణబ్ తుఫాన్ పై గ్రామాల్లో అవగాహన. కన్స్యూమర్ డిమాండ్ స్ట్రాంగ్.. మార్జిన్లపై ముడిసరుకుల సెగ! జడ్పిటిసి పీఠం ఎవరికి?. బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా 'ఉడ్తా తిర్' జోరు మందగమనం: మొదటి సోమవారం భారీగా పడిపోయిన కలెక్షన్లు ఆటో మార్జిన్లు అప్: వాల్యూమ్స్, ప్రీమియమైజేషన్‌తో పుంజుకోనున్న రంగం! మూడు దశాబ్దాల తర్వాత థియేటర్లలోకి అక్షయ్ కుమార్ 'మొహ్రా': 4కే వర్షన్‌లో రీ-రిలీజ్

12 నామినేషన్లు ఉపసంహరణ

Select Suryaa Now
12 నామినేషన్లు ఉపసంహరణ

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంరావులపాలెం మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా ఈరోజు మొత్తం 12 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.ఉపసంహరించుకున్న వారిలో వైఎస్సార్‌సీపీకి చెందిన తొమ్మిది మంది, తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు, జనసేన పార్టీకి చెందిన ఒకరు ఉన్నారు.

వైఎస్సార్‌సీపీ నుంచి ఉబలంకకు చెందిన హేమావతి కొల్లి, గొలుగూరి గౌరీదుర్గ, గోపాలపురానికి చెందిన వెంకటరెడ్డి పడాల, సూర్యకుమారి నక్క, ముమ్మిడివరప్పాడుకు చెందిన సీతారామయ్య ఉండ్రాజవరపు, రావులపాలెంకు చెందిన భవాని మల్లిడి, ఈతకోటకు చెందిన గోపాలకృష్ణ మోహన్ బొరుసు, రావులపాలెంకు చెందిన సత్యనారాయణరెడ్డి మొగలి, కొమరాజులంకకు చెందిన భూలక్ష్మి నక్క నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.

టీడీపీ నుంచి వెదిరేశ్వరానికి చెందిన తోరం మణి, దేవరపల్లికి చెందిన నామాల మణికుమారి తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా, జనసేన నుంచి ఈతకోటకు చెందిన గండ్రోతు అరుణ నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.నామినేషన్ల ఉపసంహరించుకొన్న వారు ఆయా స్థానాల్లో  పోటీ చేసే అభ్యర్థులు కు డమ్మీ గా నామినేషన్ లు వేసినవారే అవ్వడం గమనార్హమ్.