BREAKING
అర్నాబ్ తుపాను ఎఫెక్ట్‌.. 53 రైళ్ల రద్దు! జడ్పీటీసీ అభ్యర్థి కలువులపల్లి పుష్ప కు బి-ఫారం అందజేత ఎన్నికలు ప్రశాంతం గా నిర్వహించేందుకు సహకరించండి ఎస్ఎస్ఓ బృందం పనితీరుపై తహసీల్దార్ పర్యవేక్షణ ఆపరేషన్ ధియేటర్ లను ప్రారంభించిన డా. చిరంజీవి ప్రశాంత వాతావరణం లో ఎన్నికలు జరిగేలా చూడాలి నీటిని కాపాడండి – ప్రతి నీటి బొట్టు అమూల్యమైనది కూకట్‌పల్లి జోన్‌లో జల సంరక్షణపై అవగాహన ర్యాలీ సంతోషపురం ఎంపీటీసీ డమ్మీ అభ్యర్ధి నామినేషన్ ఉపసంహరణ స్థానిక సంస్థల ఎన్నికలకు అవసరమైన సామాగ్రి సిద్దం ఉధ్యాన కళాశాలలో ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలు పరిశీలన చిన్నపిల్లల్లో ఊబకాయానికి జన్యుపరమైన కారణాలు కూడా దోహదం చేస్తాయా? గత ఐదేళ్ల పాలనలో పట్టణం అధ్వాన్నం.. సీతానగరం మండలంలో ప్రభుత్వ భూముల పరిశీలన ఓటర్ల సవరణ ఆర్డర్లపై సుప్రీంకోర్టులో కేంద్ర ఎన్నికల సంఘం కౌంటర్ మెగాస్టార్ సంక్రాంతి రేసులో కన్ఫ్యూజన్: 'కాకా'నా లేక 'విశ్వంభర'నా?

ఒక్క అవకాశం ఇవ్వండి...అభివృద్ధి చేసి చూపిస్తాం .... 13 వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి రుక్మిణమ్మను గెలిపించండి.. శాప్ ఛైర్మెన్ రవి నాయుడు

Select Suryaa Now
ఒక్క అవకాశం ఇవ్వండి...అభివృద్ధి చేసి చూపిస్తాం ....  13 వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి రుక్మిణమ్మను గెలిపించండి..  శాప్ ఛైర్మెన్ రవి నాయుడు

తిరుపతి, మేజర్ న్యూస్ :

తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలలో
13 వ డివిజన్ కార్పొరేటర్ గా  కొట్టే రుక్మిణమ్మ కు ప్రజలంతా ఓట్లేసి  గెలిపిస్తే డివిజన్లోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసి చూపిస్తామని శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు ఓటర్లను అభ్యర్థించారు. సోమవారం 13వ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు, కొట్టే హేమంత్ రాయల్, టిడిపి, జనసేన, బిజెపి నాయకులతో  కొట్టే రుక్మిణమ్మకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.  స్థానిక జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలసి ఇంటింట ప్రచారం చేశారు.
తిరుపతిలో కూటమి ప్రభుత్వం  నేతృత్వంలో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత మంత్రి నారా లోకేష్ ల నేతృత్వంలో కూటమి ప్రభుత్వం తిరుపతిని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారన్నారు.
అనంతరం కార్పొరేటర్ అభ్యర్థి కొట్టే రుక్మిణమ్మ కుమారుడు, టీఎన్ఎస్ఎఫ్ తిరుపతి పార్లమెంటు జిల్లా అధ్యక్షులు కొట్టే హేమంత్ రాయల్ మాట్లాడుతూ 
రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో తన తల్లి రుక్మిణమ్మకు  ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని మీకు అందుబాటులో ఉండి సేవ చేసే భాగ్యం కల్పించాలని ఆయన  కోరారు. మీ ఇంటి ఆడపడుచు గా, అమ్మగా, ఒక సోదరిగా, ఒక అక్కగా, పిలిస్తే పలుకుతూ అందరికీ అందుబాటులో ఉంటారని చెప్పారు. కావున నవంబర్ ఒకటో తేదీ జరగబోయే పోలింగ్ రోజున టీడీపీ పార్టీ సీరియల్ నెంబర్ 2  సైకిల్  గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ ప్రచారంలో  టిడిపి నేతలు హేమంబరధరరావు, కందాటి సురేష్ రెడ్డి, రాగాల ఆనంద్ గౌడ్,  టీవీ మురళి నాథ్ రెడ్డి, విజయ్ కుమార్ బిజెపి నాయకులు భవాని శంకర్, హిమాంబర్, కందార్లటీ సురేష్ జనసేన నాయకులు అయ్యంగార్ బాల, రంగారెడ్డి,
రమేష్ నాయుడు, ప్రవీణ్ కుమార్, రాజశేఖర్, కొండారెడ్డి, దాము ఆచారి, మస్తానీ కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

H. Dwaraka, staff reporter.

Cell n  : 9705347341