BREAKING
టీడీపీ నుంచి వైసీపీ లోకి 30 కుటుంబాలు చేరిక హక్కుల సాధనకు చలో హైదరాబాద్ కు తరలిన జిపి కార్మికులు అర్నాబ్ తుపాను ఎఫెక్ట్‌.. 53 రైళ్ల రద్దు! జడ్పీటీసీ అభ్యర్థి కలువులపల్లి పుష్ప కు బి-ఫారం అందజేత ఎన్నికలు ప్రశాంతం గా నిర్వహించేందుకు సహకరించండి ఎస్ఎస్ఓ బృందం పనితీరుపై తహసీల్దార్ పర్యవేక్షణ ఆపరేషన్ ధియేటర్ లను ప్రారంభించిన డా. చిరంజీవి ప్రశాంత వాతావరణం లో ఎన్నికలు జరిగేలా చూడాలి నీటిని కాపాడండి – ప్రతి నీటి బొట్టు అమూల్యమైనది కూకట్‌పల్లి జోన్‌లో జల సంరక్షణపై అవగాహన ర్యాలీ సంతోషపురం ఎంపీటీసీ డమ్మీ అభ్యర్ధి నామినేషన్ ఉపసంహరణ స్థానిక సంస్థల ఎన్నికలకు అవసరమైన సామాగ్రి సిద్దం ఉధ్యాన కళాశాలలో ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలు పరిశీలన చిన్నపిల్లల్లో ఊబకాయానికి జన్యుపరమైన కారణాలు కూడా దోహదం చేస్తాయా? గత ఐదేళ్ల పాలనలో పట్టణం అధ్వాన్నం.. సీతానగరం మండలంలో ప్రభుత్వ భూముల పరిశీలన

వాల్మీకి విజ్ఞాన కేంద్రంలో ఆదికవి వాల్మీకి జయంతి

Select Suryaa Now
వాల్మీకి విజ్ఞాన కేంద్రంలో ఆదికవి వాల్మీకి జయంతి

జీలుగుమిల్లి, మేజర్ న్యూస్:లోక కళ్యాణానికై మర్యాద పురుషోత్తముడైన శ్రీ రాముని జీవిత గాధను సమస్త మానవాళికి ఆదర్శనీయ గ్రంథంగా, జీవన విధానాన్ని తీర్చిదిద్దే శైలిలో తీర్చిదిద్దిన  " రామాయణం" ఆదికావ్యంగా అందించిన మహర్షి వాల్మీకి నిత్య ప్రాతః స్మరణీయులని  వాల్మీకి విజ్ఞాన కేంద్రం పాఠశాల ప్రధానాచార్యులు ఎంఎస్ సుబ్రహ్మణ్యం అన్నారు.

సోమవారం వంకావారిగూడెం వాల్మీకి విజ్ఞాన కేంద్రం పాఠశాల ప్రాంగణంలో వాల్మీకి మహర్షి జయంతి జరిగింది.

 ఈ కార్యక్రమంలో వాల్మీకి మహర్షి విగ్రహానికి తొలుత పుష్పమాలను వేసి

 వాల్మీకి విగ్రహానికి పూజలు చేశారు.  రామాయణ గ్రంధానికి  కూడా పూజలుచేశారు. అట్టడుగు వర్గం నుంచి ఎదిగి ఆదికావ్యాన్ని అందించిన వాల్మీకి మహర్షి మనందరికీ ఆదర్శనీయమని జీలుగుమిల్లి  మండలం ఎస్ ఎస్ ఎఫ్ ధర్మ విస్తారక్ బొంతు రామకృష్ణ అన్నారు. కృషి,పట్టుదల ఉంటే అడవిలో తిరిగి ఒక నిరక్షరాస్యుడు కూడా మహర్షిగా ఎదిగి సంస్కృతంలోని వేలాది శ్లోకాలతో  రామాయణాన్ని అందించి, నిరూపించిన సృష్టికర్త, ఆదికవి  వాల్మీకిని మనం స్ఫూర్తిగా తీసుకోవాలని వాల్మీకి విజ్ఞాన కేంద్రం పాఠశాల ఉపాధ్యాయని వి. కామేశ్వరి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వేదుల జనార్దన్ రావు,ఎస్ఎస్ఎఫ్ ధర్మ విస్తారక్ బొంతు రామకృష్ణ, ఉర్రింకల శివశంకర్, వి. కామేశ్వరి, కె.గౌరీ శ్రీ, కూరాకుల వెంకటేశ్వరరావు, పేరం మహేష్, ఏ. అమల.జయలక్ష్మిలు విద్యార్థులు పాల్గొన్నారు.

 రిపోర్టర్ బంతు రామకృష్ణ జీలుగుమిల్లి ఏలూరు జిల్లా,