వేకువజామునే ప్రజల్లోకి నల్లా శ్రీధర్.. వాకర్స్‌తో ముఖాముఖి..
అమలాపురం మేజర్ న్యూస్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కూటమి తరఫున జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్న నల్లా శ్రీధర్ వేకువజామునే పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో వాకింగ్ చేస్తున్న వారిని కలుసుకుని మద్దతు కోరారు. ఈ సందర్భంగా అమలాపురం మున్సిపాలిటీ అభివృద్ధికి సంబంధించి ప్రజల సూచనలు, సలహాలను స్వీకరించి, పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలతో మమేకమవుతూ వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ నల్లా శ్రీధర్ సాగించిన ఈ ప్రజా సంప్రదింపులు కొనసాగాయి.