BREAKING
ప్రశాంత వాతావరణం లో ఎన్నికలు జరిగేలా చూడాలి నీటిని కాపాడండి – ప్రతి నీటి బొట్టు అమూల్యమైనది కూకట్‌పల్లి జోన్‌లో జల సంరక్షణపై అవగాహన ర్యాలీ సంతోషపురం ఎంపీటీసీ డమ్మీ అభ్యర్ధి నామినేషన్ ఉపసంహరణ స్థానిక సంస్థల ఎన్నికలకు అవసరమైన సామాగ్రి సిద్దం ఉధ్యాన కళాశాలలో ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలు పరిశీలన చిన్నపిల్లల్లో ఊబకాయానికి జన్యుపరమైన కారణాలు కూడా దోహదం చేస్తాయా? గత ఐదేళ్ల పాలనలో పట్టణం అధ్వాన్నం.. సీతానగరం మండలంలో ప్రభుత్వ భూముల పరిశీలన ఓటర్ల సవరణ ఆర్డర్లపై సుప్రీంకోర్టులో కేంద్ర ఎన్నికల సంఘం కౌంటర్ మెగాస్టార్ సంక్రాంతి రేసులో కన్ఫ్యూజన్: 'కాకా'నా లేక 'విశ్వంభర'నా? బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సరికొత్త చరిత్ర: 400 కోట్ల మైలురాయిని దాటిన కలెక్షన్లు అర్నబ్’ తుపాను పై ముందస్తు భద్రతా చర్యలను ముమ్మరం చేసిన దక్షిణ కోస్తా రైల్వే.. గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి చేపల నాగమణి ఎన్నికల ప్రచారం! ఎన్నికల నియమావళి, అర్ణబ్ తుఫాన్ పై గ్రామాల్లో అవగాహన. కన్స్యూమర్ డిమాండ్ స్ట్రాంగ్.. మార్జిన్లపై ముడిసరుకుల సెగ!

ఎంపీటీసీ ఎన్నికల సిబ్బందికి శిక్షణ

Select Suryaa Now
ఎంపీటీసీ ఎన్నికల సిబ్బందికి శిక్షణ

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంరాబోయే ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో భాగంగా మండపేట మండల ఎన్నికల సిబ్బందికి ప్రత్యేక అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని స్థానిక డాక్టర్ పాలడుగు సత్యవతి చంద్రమౌళి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఎంపీడీఓ కె. సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ శిక్షణ కార్యక్రమంలో ఎంపీటీసీ ఎన్నికలకు ప్రిసైడింగ్ అధికారులు  అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు గా ఎంపికైన సిబ్బంది పాల్గొన్నారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ పోలింగ్ ప్రక్రియను నిష్పాక్షికంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. పోలింగ్ రోజున అనుసరించాల్సిన విధివిధానాలు, ఓటింగ్ యంత్రాలు లేదా బ్యాలెట్ బాక్సుల నిర్వహణ, పోలింగ్ సామగ్రి సేకరణ, పంపిణీ కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు.ఎన్నికల విధుల్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలని, తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని శిక్షకులు సూచించారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకతకు, నిబంధనల అమలుకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, శిక్షకులు, ఎన్నికల విధులకు నియమితులైన సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు