BREAKING
స్ట్రోక్ పై చిన్నారులతో కేర్ హాస్పిటల్స్ వినూత్న కార్యక్రమం - పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు పట్టణంలో కొత్తపల్లి ఇంటింటి ప్రచారం మీ ఇంటి ఆడబిడ్డ గా పింకీ జైన్ ను ఆదరించి గెలిపించండి.... మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ ఇంటింటా ప్రచారం ఆర్.సి.యం చర్చి వార్షికోత్సవ శుభాకాంక్షలు - ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆర్నాబ్ తుఫాను నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి - మండల వ్యవసాయ అధికారి జి. వాణి. భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండాలి స్థానిక ఎన్నికల ప్రచారంలో నల్లమిల్లి మనోజ్ రెడ్డి. పలు చోట్ల టీడీపీ అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం. వాల్మీకి విజ్ఞాన కేంద్రంలో ఆదికవి వాల్మీకి జయంతి ఒక్క అవకాశం ఇవ్వండి...అభివృద్ధి చేసి చూపిస్తాం .... 13 వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి రుక్మిణమ్మను గెలిపించండి.. శాప్ ఛైర్మెన్ రవి నాయుడు ఎంపీటీసీ ఎన్నికల సిబ్బందికి శిక్షణ శాంతియుత ఎన్నికల నిర్వహణకు అందరూ సహకరించాలి - డీఎస్పీ విద్య. ఆగిరిపల్లిలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేత గ్రామాల అభివృద్ధికి సహకరిస్తా: మాజీ ఎమ్మెల్యే ఎం.వి. ప్రతాప్ అప్పారావు 12 నామినేషన్లు ఉపసంహరణ వేకువజామునే ప్రజల్లోకి నల్లా శ్రీధర్.. వాకర్స్‌తో ముఖాముఖి.. ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం క్యాంప‌స్‌లో పారిశుధ్య నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు

పార్టీ ప్రచార ఖర్చులు ఎన్నికల అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల్లో వేయరాదు

Select Suryaa Now
పార్టీ ప్రచార ఖర్చులు ఎన్నికల అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల్లో వేయరాదు

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం

రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు రెండవ సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 14, 19 తేదీల్లో నోటిఫికేషన్లు జారీ చేసిందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సోమవారం  ప్రకటన లో తెలిపారు.

ఎన్నికల ఖర్చుల నియంత్రణ, లెక్కల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను రాజకీయ పార్టీల అన్ని స్థానిక విభాగాలకు తెలియజేయాలని ఆమె సూచించారు.ఎన్నికల సందర్భంగా అభ్యర్థి లేదా అతని ఎన్నికల ఏజెంట్ ద్వారా చేసిన లేదా అధికారం ఇచ్చిన ఖర్చులతో పాటు, అభ్యర్థి ఎన్నికను ప్రోత్సహించేందుకు ఇతర వ్యక్తులు, సంఘాలు, సంబంధిత రాజకీయ పార్టీ చేసిన ఖర్చులను కూడా నిబంధనల ప్రకారం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.ఒక నిర్దిష్ట అభ్యర్థి కోసం చేసే ప్రచారానికి భిన్నంగా, రాజకీయ పార్టీ తన సాధారణ ప్రచారంలో భాగంగా చేసే ఖర్చులను అభ్యర్థి ఎన్నికల ఖర్చుల ఖాతాలో చేర్చరాదని, ఆ రాజకీయ పార్టీ ఖాతాలో చేర్చాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసిందన్నారు. ఏ అభ్యర్థి పేరు,ఫోటో లేకుండా పార్టీ నాయకుడి ఫోటో, విజ్ఞప్తితో ముద్రణ, ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో ఇచ్చే సాధారణ ప్రచార ప్రకటనలు, పోస్టర్లు, బ్యానర్లు, జెండాలు, స్టిక్కర్లకు అయ్యే ఖర్చులను రాజకీయ పార్టీ ఖాతాలో నమోదు చేయాలి.  ప్రచార ప్రకటనలు ,సామగ్రిలో నిర్దిష్ట అభ్యర్థి , అభ్యర్థుల పేరు ,ఫోటో ఉన్నట్లయితే, సంబంధిత ఖర్చును ఆ అభ్యర్థి ఎన్నికల ఖర్చుల ఖాతాలో నమోదు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

రాజకీయ పార్టీ నాయకులకు సాధారణ ప్రచారం కోసం నిబంధనల మేరకు వాహన అనుమతులు జారీ చేయవచ్చని, అయితే, ఏదైనా వార్డు, స్థానిక సంస్థ ప్రాదేశిక నియోజకవర్గంలో ఆ వాహనాన్ని నిర్దిష్ట అభ్యర్థులతో కలిసి వినియోగించినట్లయితే, అందుకు సంబంధించిన ఖర్చును సంబంధిత అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల ఖాతాల్లో కేటాయించాలని ఎన్నికల సంఘం సూచించినట్లు తెలిపారు. ఈ మార్గదర్శకాలను రాజకీయ పార్టీల స్థానిక విభాగాలు, అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి సూచించారు.