BREAKING
ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు శిక్షణ! చంద్రగిరి నియోజక వర్గంలో 142 మంది వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామి నేషన్లు తిరస్కరణ -ఒక న్యాయవాదిగా అభ్యర్థుల తరపున వెళ్లిన చెవిరెడ్డి పినపళ్లలో టీడీపీ జోరు... వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి చేరికలు... 7, 8, 9 వార్డుల్లో టీడీపీ, జనసేన అభ్యర్థుల ప్రచారం పశు వైద్యశాల నూతన భవనానికి రూ.30 లక్షల అంచనాలు సిద్ధం. ​ఆర్ఐఎన్ఎల్‌లో ఘనంగా విజిలెన్స్ వారోత్సవాలు ​ఉద్యోగుల చేత 'సమగ్రతా ప్రతిజ్ఞ' ఇన్ఫోసిస్‌ ప్రారంభోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.. కలెక్టర్‌ మను చౌదరి ఆదేశం స్ట్రోక్ పై చిన్నారులతో కేర్ హాస్పిటల్స్ వినూత్న కార్యక్రమం - పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు పట్టణంలో కొత్తపల్లి ఇంటింటి ప్రచారం మీ ఇంటి ఆడబిడ్డ గా పింకీ జైన్ ను ఆదరించి గెలిపించండి.... మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ ఇంటింటా ప్రచారం ఆర్.సి.యం చర్చి వార్షికోత్సవ శుభాకాంక్షలు - ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆర్నాబ్ తుఫాను నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి - మండల వ్యవసాయ అధికారి జి. వాణి. భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండాలి స్థానిక ఎన్నికల ప్రచారంలో నల్లమిల్లి మనోజ్ రెడ్డి. పలు చోట్ల టీడీపీ అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం. వాల్మీకి విజ్ఞాన కేంద్రంలో ఆదికవి వాల్మీకి జయంతి

'అర్నాబ్ 'తుఫాను సహాయక కార్యక్రమాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా పనిచెయ్యాలి --తుఫాన్ పరిస్థితి, సహాయక చర్యలుపై వర్చువల్ గా అధికారులతో సమీక్షించిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి

Select Suryaa Now
'అర్నాబ్ 'తుఫాను సహాయక కార్యక్రమాల్లో  అధికార యంత్రాంగం అప్రమత్తంగా పనిచెయ్యాలి  --తుఫాన్ పరిస్థితి, సహాయక చర్యలుపై వర్చువల్ గా అధికారులతో సమీక్షించిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి

నూజివీడు, సూర్య న్యూస్: 'అర్నాబ్' తుఫాను సహాయక కార్యక్రమాల్లో ప్రభుత్వ ప్రతిష్ట ఇనుమడింపచేసేలా అధికార యంత్రాంగం పనిచేయ్యాలని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాలు శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులతో సోమవారం వర్చువల్ విధానంలో సమీక్షించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ  'అర్నాబ్' తుఫాన్ కారణంగా జిల్లాలో భారీ వర్షాలు, ముంపు ప్రమాదం ఉన్న ప్రతీ ప్రాంతంలోని ప్రజలను, లోతట్టు ప్రాంతాలు ప్రజలను అప్రమత్తం చేసి అవసరం మేరకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తుఫాన్ ప్రభావం అధికంగా ఉండే గ్రామాలుపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, ఎక్కడా ఎటువంటి ప్రాణ,ఆస్తి, మూగజీవాలు, పంటనష్టాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.సహాయక చర్యల్లో ఎటువంటి లోపాలు లేకుండా ప్రభుత్వ ప్రతిష్టను పెంచే విధంగా పనిచేయ్యాలని, నిర్లక్ష్యం వహించకుండా  అధికారులు అప్రమత్తంగా ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనించి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు.వరద నీటిలో మునిగిన పంటను కాపాడుకునే చర్యలుపై రైతులకు అవగాహన  కల్పించాలని ఆదేశించారు. వాగులు, డ్రైన్లలో చెత్తను వెంటనే తొలగించి వరద నీరునిలిచి పోకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. పెనుగాలులకు కూలిన చెట్లను వెంటనే తొలగించాలని, తెగిన విద్యుత్తు వైర్లతో ప్రమాదాలు జరగకుండా చూడాలని, కూలిన స్తంభాలు స్థానంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేసేలా సిద్ధం కావాలి. అధికార యంత్రాంగం అంతా సమిష్టిగా పనిచేసి తక్షణ చర్యలు తీసుకోవాలని, నిరంతర పర్యవేక్షణతో నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. త్రాగునీరు, మెడికల్ క్యాంపులు, విద్యుత్తు సరఫరా, రవాణా వ్యవస్థలు ఆటంకం వాటిల్లిన తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని అన్నారు.రెవెన్యూ, మెడికల్, రవాణా, పోలీసు, పంచాయతీ, ఆర్&బి, విద్యుత్తు తదితర శాఖలు అధికారులు అంతా సమిష్టిగా  నిరంతరం పర్యవేక్షణ చేసి నివారణ చర్యలు చేపట్టాలని, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవటానికి అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశించారు.

 పసుమర్తి రాము జిల్లా ఇన్చార్జి ఏలూరు