BREAKING
ఇన్ఫోసిస్‌ ప్రారంభోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.. కలెక్టర్‌ మను చౌదరి ఆదేశం స్ట్రోక్ పై చిన్నారులతో కేర్ హాస్పిటల్స్ వినూత్న కార్యక్రమం - పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు పట్టణంలో కొత్తపల్లి ఇంటింటి ప్రచారం మీ ఇంటి ఆడబిడ్డ గా పింకీ జైన్ ను ఆదరించి గెలిపించండి.... మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ ఇంటింటా ప్రచారం ఆర్.సి.యం చర్చి వార్షికోత్సవ శుభాకాంక్షలు - ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆర్నాబ్ తుఫాను నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి - మండల వ్యవసాయ అధికారి జి. వాణి. భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండాలి స్థానిక ఎన్నికల ప్రచారంలో నల్లమిల్లి మనోజ్ రెడ్డి. పలు చోట్ల టీడీపీ అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం. వాల్మీకి విజ్ఞాన కేంద్రంలో ఆదికవి వాల్మీకి జయంతి ఒక్క అవకాశం ఇవ్వండి...అభివృద్ధి చేసి చూపిస్తాం .... 13 వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి రుక్మిణమ్మను గెలిపించండి.. శాప్ ఛైర్మెన్ రవి నాయుడు ఎంపీటీసీ ఎన్నికల సిబ్బందికి శిక్షణ శాంతియుత ఎన్నికల నిర్వహణకు అందరూ సహకరించాలి - డీఎస్పీ విద్య. ఆగిరిపల్లిలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేత గ్రామాల అభివృద్ధికి సహకరిస్తా: మాజీ ఎమ్మెల్యే ఎం.వి. ప్రతాప్ అప్పారావు 12 నామినేషన్లు ఉపసంహరణ వేకువజామునే ప్రజల్లోకి నల్లా శ్రీధర్.. వాకర్స్‌తో ముఖాముఖి..

ఈ నెల 27న ఖేలో ఇండియా వాలీబాల్ సెలక్షన్స్ అండర్-17 బాలబాలికలకు ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి ఎంపికలు

Select Suryaa Now
ఈ నెల 27న ఖేలో ఇండియా వాలీబాల్ సెలక్షన్స్  అండర్-17 బాలబాలికలకు ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి ఎంపికలు

సంగారెడ్డి: ఖేలో ఇండియా ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా అండర్-17 బాలబాలికల వాలీబాల్ సెలక్షన్ ట్రయల్స్ ఈ నెల 27న సంగారెడ్డి జిల్లాలోని దౌల్తాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు ఖేలో ఇండియా ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి అంజా గౌడ్ తెలిపారు. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్టీరింగ్ కమిటీ సభ్యులు ప్రమోద్ కుమార్ రెడ్డి, ఎండీ షాజియా ఆదేశాల మేరకు ఈ ఎంపిక ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

అర్హత కలిగిన క్రీడాకారులు హాజరుకావాలి

ఈ సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనాలనుకునే బాలబాలికలు తప్పనిసరిగా ఆధార్ కార్డు, బోనఫైడ్ సర్టిఫికెట్, పదో తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్ తీసుకురావాలని అంజా గౌడ్ సూచించారు. 01-01-2009 తర్వాత జన్మించిన వారు మాత్రమే ఈ ఎంపికలకు అర్హులని స్పష్టం చేశారు.ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన అర్హులైన వాలీబాల్ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.