BREAKING
పశు వైద్యశాల నూతన భవనానికి రూ.30 లక్షల అంచనాలు సిద్ధం. ​ఆర్ఐఎన్ఎల్‌లో ఘనంగా విజిలెన్స్ వారోత్సవాలు ​ఉద్యోగుల చేత 'సమగ్రతా ప్రతిజ్ఞ' ఇన్ఫోసిస్‌ ప్రారంభోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.. కలెక్టర్‌ మను చౌదరి ఆదేశం స్ట్రోక్ పై చిన్నారులతో కేర్ హాస్పిటల్స్ వినూత్న కార్యక్రమం - పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు పట్టణంలో కొత్తపల్లి ఇంటింటి ప్రచారం మీ ఇంటి ఆడబిడ్డ గా పింకీ జైన్ ను ఆదరించి గెలిపించండి.... మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ ఇంటింటా ప్రచారం ఆర్.సి.యం చర్చి వార్షికోత్సవ శుభాకాంక్షలు - ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆర్నాబ్ తుఫాను నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి - మండల వ్యవసాయ అధికారి జి. వాణి. భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండాలి స్థానిక ఎన్నికల ప్రచారంలో నల్లమిల్లి మనోజ్ రెడ్డి. పలు చోట్ల టీడీపీ అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం. వాల్మీకి విజ్ఞాన కేంద్రంలో ఆదికవి వాల్మీకి జయంతి ఒక్క అవకాశం ఇవ్వండి...అభివృద్ధి చేసి చూపిస్తాం .... 13 వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి రుక్మిణమ్మను గెలిపించండి.. శాప్ ఛైర్మెన్ రవి నాయుడు ఎంపీటీసీ ఎన్నికల సిబ్బందికి శిక్షణ శాంతియుత ఎన్నికల నిర్వహణకు అందరూ సహకరించాలి - డీఎస్పీ విద్య. ఆగిరిపల్లిలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేత గ్రామాల అభివృద్ధికి సహకరిస్తా: మాజీ ఎమ్మెల్యే ఎం.వి. ప్రతాప్ అప్పారావు

పూడూరు–మేడ్చల్ మధ్య జోరుగా అక్రమ మట్టి దందా

Select Suryaa Now
పూడూరు–మేడ్చల్ మధ్య జోరుగా అక్రమ మట్టి దందా
మేడ్చల్, మేజర్ న్యూస్:పూడూరు నుంచి మేడ్చల్ పట్టణం వరకు అక్రమ మట్టి తరలింపు జోరుగా సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత నాలుగు రోజులుగా రాత్రింబవళ్లు తేడా లేకుండా మట్టి వాహనాలు రాకపోకలు సాగిస్తున్నా సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదని విమర్శిస్తున్నారు. మరోవైపు, కొన్ని వాహనాలపై జీహెచ్‌ఎంసీ ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసుల పేర్లతో కూడిన స్టిక్కర్లు కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ఈ స్టిక్కర్లకు అధికారిక అనుమతులు ఉన్నాయా? లేక అధికారుల తనిఖీల నుంచి తప్పించుకునేందుకు ఉపయోగిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్టిక్కర్లు అతికించుకుంటే అక్రమ రవాణాకు అనుమతి వచ్చినట్టేనా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్, పోలీస్, రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు సమన్వయంతో రంగంలోకి దిగి వాహనాల అనుమతులు, మట్టి తరలింపు పత్రాలు, స్టిక్కర్ల ప్రామాణికతను తనిఖీ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ రవాణా నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇటు అధికారులను సామాన్యులను మభ్యపెట్టడానికి ఇలా ప్రభుత్వానికి సంబంధించిన స్టిక్కర్లు వేసి వాహనాలు నడపడం ఎంతవరకు సమంజసం అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.